కియా కార్లు మాత్రం టాప్ రేంజులో దూసుకుపోతున్నాయి.. ఇటీవల మార్కెట్ లోకి విడుదల అయిన ఈ కార్లు ఇప్పుడు మేడిన్ ఆంధ్రా కారుగా దూసుకుపోతుంది.. ఈ కారు మార్కెట్ లోకి వచ్చి ఏడాది కావడంతో అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు.. కియా సోనెట్, కియా సెల్టోస్ మోడళ్ల ద్వారా ఆ సంస్థ కార్ల అమ్మకాలు దూసుకుపోతున్నాయి. దీంతో కియా మోటార్స్ సేల్స్‌ను మరింత పెంచుకునేలా కొత్త విధానాలను రూపొందిస్తుంది..