క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ప‌ట్టిపీడిస్తున్న వేళ  కొన్ని దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా అంచ‌నావేశారు. కరోనా వైరస్‌ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో ఎదురుకానున్నాయ‌ని పేర్కొన్నారు.  ప్ర‌పంచ దేశాల ప్ర‌జ‌లు గుండె నిబ్బ‌రాన్ని పెంపొందించుకోవాల‌ని, అస‌లు క‌ష్టాల‌న్నీ ముందే ఉన్నాయ‌న్న విష‌యాన్ని విస్మ‌రించ‌రాద‌ని పేర్కొన్నారు. అలాగే 170 దేశాలలో తలసరి ఆదాయం వృద్ధి మైనస్‌లోకి వెళ్లిపోవచ్చ ని హెచ్చ‌రించారు.  వాషింగ్టన్‌లో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై గురువారం జరిగిన ఓ స‌ద‌స్సులో  జార్జీవా పాల్గొని మాట్లాడారు.

 

వర్ధమాన దేశాలకు ట్రిలియన్‌ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు.  ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనా వైరస్‌ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేస్తోంద‌ని, దీన్ని ఐక్య‌త‌తోనే ప్ర‌పంచ దేశాలు ఎదుర్కొగ‌ల‌వ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే వైరస్‌పై పోరాడేందుకు లాక్‌డౌన్‌ అవసరమని, ఇది వందల కోట్ల ప్రజలపై ప్రభావం చూపిస్తోందన్నారు. 

 

ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక స‌మ‌స్య‌లను ఎదుర్కొనున్నాయ‌ని తెలిపారు. ఇప్పుడు ప్ర‌పంచ దేశాల ముందు ఆర్థిక మాంద్యం స‌వాల్ ఉంద‌ని అన్నారు. నానాటికి నిరుద్యోగం పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. మన జీవిత కాలంలో గుర్తున్నంత వరకు ఈ స్థాయి ప్రభావాన్ని చూడలేదు’’ అని జార్జీవా పేర్కొన్నారు.  2020లో ప్రపంచ వృద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో రోజురోజుకు లాక్‌డౌన్ ప‌రిణామం ప్ర‌భావం ప‌రిశ్ర‌మ‌ల వ‌ర్గాల‌పై తీవ్రంగా ప‌డుతోంది. మ‌రోవైపు వైర‌స్ ఉధృతి పెరుగుతుండ‌టంతో భయాందోళ‌న‌లు పెరుగుతున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: