భారత దేశంలోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ అంటే వెంటనే గుర్తొచ్చేది మాత్రం ఎస్బీఐ.. అతి తక్కువ వడ్డీకే రుణాలను అందించడంతో పాటుగా అన్నీ సదుపాయాలను అందిస్తుంది.. అయితే ఇటీవల కరోనా వల్ల అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నా ప్రజలకు ఈ బ్యాంక్ అన్నీ రకాలుగా ఆదుకుంది.. ఈ బ్యాంక్ బెనిఫిట్స్ ను చూసి ప్రజలు ఎక్కువగా ఈ బ్యాంకుల లో డిపాజిట్లు చేయడం, కొత్త ఖాతాలను తెరవడం, పాటుగా ఈ బ్యాంక్ పై ఇన్వెష్ట్ చేస్తూ వస్తున్నారు.. దీంతో బ్యాంక్ పాపులేషన్ పూర్తిగా పెరిగిపోయింది.. ప్రజలకు పెట్టుబడులకు సంబంధించిన అన్నీ సౌకర్యాలు ఈ బ్యాంకులో ఉండటంతో ప్రజలు ఎక్కువగా ఈ బ్యాంక్ వైపు మొగ్గు చూపుతున్నారు..



ప్రస్తుతం ఈ బ్యాంక్ విధానాలను మిగిలిన బ్యాంకులు కూడా అవలంభిస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఎస్వీఐ లో లోన్ పొందాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించాలని యాజమాన్యం వెల్లడించింది.. లోన్ పొందాలని అనుకునేవారు కొన్ని అర్హతలు కూడా కలిగి ఉండాలని అంటున్నారు.. ఆ అర్హతలు ఉంటే వారి జీతానికి 24 రేట్లు ఎక్కువ రుణాలను పొందవచ్చు నని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు చూడండి..


లోన్ పొందటానికి కావలసిన అర్హతలు ఇవే..

ముందుగా అతను రుణం పొందటానికి నెల జీతానికి సంబందించిన శాలరీ అకౌంట్ కలిగి ఉండాలి. నెలకు నికర వేతనం రూ.15,000 రావాలి. ఈఎంఐ లేదా ఎన్ఎంఐ రేషియో 50 శాతానికి దిగువున ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేటు సంస్థల్లో పని చేయాలి. ఇకపోతే అతని వయసు 21-58 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఒక కంపెనీ లో కనీసం ఏడాది నుంచి కంపెనీ లో ఉద్యోగం చేస్తుండాలి. ఇవన్నీ కరెక్టుగా ఉంటే రూ.20 లక్షల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేట్లు 10.6 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి... ఇది వీటన్నిటికీ సంబంధించినవి కరెక్ట్ గా ఉంటే ఈజీగా రుణాన్ని పొందవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: