2024 ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా పరుగులు చేస్తూ రానిస్తోంది. ఒకప్పుడు కేవలం పటిష్టమైన బౌలింగ్ విభాగంతో మాత్రమే నెట్టుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇక ఇప్పుడు బ్యాటింగ్ విభాగంలో కూడా పట్టిష్టంగా మారిపోయింది. మొదటి బంతి నుంచే ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకువస్తుంది. సన్రైజర్స్ బ్యాట్స్మెన్ ల విధ్వంసం ముందు ప్రత్యర్థి జట్టు బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరును రెండుసార్లు బద్దలు కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ప్రతి మ్యాచ్ లో కూడా 200  పరుగులను ఎంతో అలవోకగా చేసేస్తుంది. అయితే ఇటీవల టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో కూడా మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఇక తక్కువ పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోతుంది. ఇలాంటి సమయంలో ఇక రాజస్థాన్ చేతిలో సన్రైజర్స్ ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్సులతో జట్టుకు రెండు వందల పరుగులను అందించడంలో సక్సెస్ అయ్యారు.


 అయితే 201 పరుగుల టార్గెట్లో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా మంచి ప్రదర్శన చేసింది. ఒకానొక సమయంలో రాజస్థాన్ కు గెలుపు ఖాయం అనే పరిస్థితి వచ్చింది. ఇక చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ సాగిన పోరిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం ఒకే ఒక పరుగు తేడాతో ఓడిపోయింది అని చెప్పాలీ. అయితే ఇలా ఒక పరుగు తేడాతో గెలిచిన సన్రైజర్స్ అరుదైన రికార్డు సృష్టించింది.  అత్యల్ప తేడాతో గెలిచిన మ్యాచ్ ను తన పేరిట నమోదు చేసుకుంది. నిన్నటి మ్యాచ్లో ఒక్కరన్ తేడాతో గెలిచింది. ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు హిస్టరీ లోనే ఒకరన్ తేడాతో గెలిచింది ఇదే మొదటిసారి. ఇక ఇదే సీజన్లో పంజాబ్ రెండు పరుగులు తేడాతో గెలిచింది అన్న విషయం తెలిసిందే. 2022లో ముంబై పై మూడు పరుగులు 2014లో ఢిల్లీపై నాలుగు పరుగు తేడాతో సన్రైజర్స్ విజయం సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl