ఏపీలో ఎన్నికలకు సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రతి సర్వే ఫలితాల గురించి ఏపీ ప్రజల మధ్య చర్చ జరుగుతోంది. విశ్వసనీయత ఉన్న సంస్థలతో పాటు కొత్త సంస్థలు సైతం సర్వే ఫలితాలను ప్రచురిస్తూ ఓటర్లను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. రవిప్రకాష్ సర్వే ప్రకారం సీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉండగా ఏకంగా 29 నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని సర్వే చెబుతోంది.
 
29 నియోజకవర్గాల్లో విజయం సాధించడం వైసీపీకి ప్లస్ పాయింట్ అయినా గత ఎన్నికల్లో 49 నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ 20 స్థానాలను కోల్పోవడం అంటే సులువైన విషయం కాదు. జగన్ సీమపై మరింత దృష్టి పెట్టి రాయలసీమలో కనీసం 40 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రయత్నాలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. రవిప్రకాష్ సర్వేలో కూటమికి సీమలో 22 స్థానాల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది.
 
విచిత్రం ఏంటంటే సీమలో ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయట. రవిప్రకాష్ సర్వే ఫలితాలు అంటే ప్రజల్లో ఒకింత నమ్మకం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని 4 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని రవిప్రకాష్ చెబుతున్నారు.
 
అయితే ఉమ్మడి కర్నూలులో వైసీపీకి 12 నుంచి 13 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాబోయే 10 రోజుల్లో మరిన్ని సర్వేల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. రాయలసీమలో వైసీపీదే పైచేయి అని ప్రతి సర్వే చెబుతుండగా ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే చర్చ ప్రజల మధ్య సైతం జోరుగా జరుగుతుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: