తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల రాజకీయాలు ఒక విధంగా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు మరోరకంగా ఉంటాయి. ఇప్పటికే ఈ జిల్లాకు చెందినటువంటి నాయకులు కేంద్ర, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. అలాంటి కరీంనగర్ లో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ పోరు రసవత్తరంగా సాగుతోంది. బిజెపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  టఫ్ ఫైట్ ఉన్నది. ఇందులో బిజెపి నుంచి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్  పోటీ చేస్తున్నారు.  ఇందులో బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, బోయినపల్లి వినోద్ కుమార్  బండి కంటే ముందు ఎంపీగా కరీంనగర్ లో పనిచేశారు.

 ఈ ఇద్దరు రాజకీయ అనుభవం ఉన్నవారే. ఇదే తరుణంలో కాంగ్రెస్ మాత్రం రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి రాజేందర్రావును బరిలో ఉంచింది. కానీ ఆయన గెలుపు కోసం  మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో మూడు పార్టీల మధ్య హోరా హోరీగా పోరు జరుగుతుంది.  ఎవరు గెలిచినా కొద్దిపాటి లోనే గెలుస్తారని అంటున్నారు. ఇదే తరుణంలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి గట్టి షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. బిజెపిలో కీలకంగా  ఉన్నటువంటి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారట. ఈయన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజెపి తరఫున హుస్నాబాద్ లో పోటీ చేశారు. ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది.

త్వరలో పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్న తరుణంలో  శ్రీరామ్ చక్రవర్తి  కాంగ్రెస్ లోకి వెళ్లడం అనేది బిజెపికి తీరని లోటు అని చెప్పవచ్చు. ఒకవేళ ఆయన ఒకటి, రెండు రోజుల్లో జంప్ అయితే మాత్రం  బిజెపి ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈయనతో పాటుగా  పలువురు కౌన్సిలర్లు, కొంతమంది కీలక నేతలు కూడా వెళ్తున్నట్టు సమాచారం. ఈయనను కాంగ్రెస్ లోకి రప్పించడానికి  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక రోల్ పోషించారని  తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం  బిజెపి ఎంపీ క్యాండిడేట్   బండి సంజయ్ గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: