టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరమని జగన్, వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. బాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు సాధ్యం కాని మేనిఫెస్టో అని బాబుకు కూడా తెలుసని ఏపీ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. పథకాలను చిత్తుశుద్ధితో అమలు చేసే ఉద్దేశం లేకపోతే ఎన్ని హామీలైనా ప్రకటించవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
2014 మేనిఫెస్టోను వెబ్ సైట్ ను మాయం చేసిన చంద్రబాబు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోను మాయం చేయరని చెప్పడానికి గ్యారంటీ ఏముందని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రకటించిన హామీల ప్రకారం నెలకు బీసీ మహిళలకు పింఛన్ ఇవ్వాలంటే 1400 కోట్ల రూపాయలు, యువతకు నిరుద్యోగ భృతి క్రింద 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
వాలంటీర్లకు 10,000 వేతనం అంటే నెలకు 265 కోట్ల రూపాయలు, 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళల పింఛన్ కోసం నెలకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు 4800 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు చెప్పిన హామీలు అమలు చేయకపోయినా 2019లో టీడీపీ అధికారం కోల్పోయే సమయానికి ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.
 
ఈ స్కీమ్స్ తో పాటు ఆరోగ్యశ్రీ, మధ్యాహ్న భోజనం, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ఎన్నో పథకాల కోసం నెలకు 13,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సంపద సృష్టించడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు. బాబు మాటలు నీటి మీద రాతలు అని ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు అమలు చేయాలంటే కఠినమైన షరతులు పెట్టి 20 శాతం మందికి మాత్రమే అమలు చేసే ఛాన్స్ ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ అధికారం ముఖ్యమనుకుంటే ఇలాంటి సాధ్యం కాని హామీలను ప్రకటించేవారని
విశ్వసనీయత ముఖ్యమని జగన్ సాధ్యం కాదని హామీలకు దూరంగా ఉన్నారని ఓటర్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: