- ఓసీ Vs బీసీ మ‌హిళ - లోక‌ల్ Vs నాన్ లోక‌ల్‌
- అమ‌రావ‌తి Vs  విశాఖ - టీడీపీ గ్రూపులు Vs  వైసీపీ వ్యూహాలు
- ఎన్నిక‌ల టైంకు ఝాన్సీకి ప్ల‌స్‌లు.. భ‌ర‌త్‌కు మైన‌స్‌లు పెరుగుతున్నాయా ?

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

ఆరు నెల‌ల‌కు ముందు విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు సీటుపై వైసీపీ గెలుస్తుంద‌న్న అంచ‌నాలు ఎవ్వ‌రికి లేవు. కార‌ణం జ‌న‌సేన పొత్తు ప్ర‌భావంతో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీలో ఉండే బాల‌య్య అల్లుడు, లోకేష్‌కు తోడ‌ళ్లుడు గీత‌మ్‌కు భ‌ర‌త్‌కు తిరుగే ఉండ‌ద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆ టాకే ఎక్కువుగా జ‌నాల్లో వినిపించింది. తీరా ఇప్పుడు ఎన్నిక‌ల‌కు వారం రోజుల ముందే చూస్తే బొత్స ఝాన్సీ దూకుడు ముందు భ‌ర‌త్ బేజార‌వుతోన్న ప‌రిస్థితే ఉంది. మామూలుగా అయితే ఆరేడు నెల‌ల ముందు భ‌ర‌త్‌దే గెలుపు అని అంద‌రూ అన్నారు. ఆ టైంలో అస‌లు విశాఖ పార్ల‌మెంటుకు వైసీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ?  కూడా క్లారిటీ లేదు.


జ‌గ‌న్ ఝాన్సీకి సీటు ఇచ్చిన‌ప్పుడు కూడా ఆమెను విజ‌య‌న‌గ‌రంలో పోటీ చేయిస్తే బాగుండేది క‌దా.. జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా విశాఖ‌లో ఎందుకు పోటీ పెట్టారు ?  పైగా విజ‌య‌న‌గ‌రం తూర్పు కాపుల పార్ల‌మెంటు సీటు.. ప‌క్క ప‌క్క‌నే రెండు అదే క‌మ్యూనిటీకి ఎందుకు ఇచ్చారు ?  విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు ప‌రిధిలోనే బొత్స ఫ్యామిలీ మెంబ‌ర్స్ ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు.. ఆమె అక్క‌డ పోటీ చేయాల్సింది... జ‌గ‌న్ త‌ప్పు చేశార‌నే అంద‌రూ అన్నారు.


ఎవ‌రి ప్ర‌చారం ఎలా ఉన్నా జ‌స్ట్ నెల రోజుల్లో సీన్ మారింది. ఝాన్సీ ఇక్క‌డ పోటీ ఎందుకు అని ఆలోచించే వాళ్ల ఆలోచ‌న‌ల‌కు ఒక్క మెట్టుపైనే జ‌గ‌న్ ఆలోచ‌న ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. విశాఖ పార్ల‌మెంటు సీటు ముందు నుంచి నాన్ లోక‌ల్స్‌కు.. అగ్ర వ‌ర్ణాల‌కు అడ్డా. ఇక్క‌డ నుంచి గ‌త మూడు ద‌శాబ్దాలుగా నాన్ లోక‌ల్స్‌.. అందులోనూ క‌మ్మ‌, రెడ్డి నేత‌లే ఎక్కువుగా ఎంపీలుగా ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. బీసీ + మ‌హిళ అయిన ఝాన్సీ విశాఖ‌కు లోక‌ల్‌.


ఇక ఝాన్సీ భ‌ర్త మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎలాంటి రాజ‌కీయ ధురంధ‌రుడో చెప్ప‌క్క‌ర్లేదు. క‌ళా వెంక‌ట్రావుకు టీడీపీ టిక్కెట్ ఇవ్వ‌డంతో అక్క‌డ ఎప్పుడో ఫ్రీ అయిపోయిన బొత్స చీపురుప‌ల్లి బాధ్య‌త‌లు త‌న మేన‌ళ్లుడు చిన్న శ్రీనుకు ఇచ్చేసి తాను విశాఖ‌లో రాజ‌కీయం మొద‌లు పెట్టేశాడు. అటు టీడీపీ ఓసీ భ‌ర‌త్ వ‌ర్సెస్ ఇటు వైసీపీ బీసీ మ‌హిళ ఝాన్సీ నిన‌దం హైలెట్ అవుతోంది. చంద్ర‌బాబు అభివృద్ది అంతా అమ‌రావ‌తే అంటంటే ఇక్క‌డ వైసీపీ వాళ్లు విశాఖ ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుంద‌ని చేస్తోన్న ప్ర‌చారం.. ఇక్క‌డ గ్లోబ‌ల్ మార్కెట్ పెరుగుతుంద‌న్న అంచ‌నాలు కూడా వైసీపీ చాలా అంటే చాలా ప్ల‌స్ అవుతున్నాయి.


ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు శ్రీ భ‌ర‌త్‌కు ఉన్న ప్ల‌స్‌లు ఈ రోజు ఎన్నిక‌లకు 9 రోజుల ముందు అయితే లేవు. వైసీపీ చాప‌కింద నీరులా జోరందుకుంది. మ‌రి ఈ నేప‌థ్యంలో వైజాగ్ పార్ల‌మెంటు సీటు పోరులో భ‌ర‌త్‌కు ఝాన్సీ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: