ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఆయనతో పాటు తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా న్యాయస్థానం బిగ్ రిలీఫ్ ఇచ్చింది.వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వైఎస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్ వేశాడు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ రద్దు చేయాలని కోరారు.అయితే ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీ అవినాశ్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని దస్తగిరి పిటిషన్‌ లో ఆరోపించారు. అయితే దస్తగిరి వాదనను ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేందుకు తగిన ఆధారాలు చూపలేదని కోర్టులో వాదించారు.దాన్ని బేస్ చేసుకొని దస్తగిరి పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు.దీంతో ఎంపీ అవినాశ్ రెడ్డి బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయ్యింది. ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒకవేళ ముందస్తు బెయిల్ రద్దు అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి జైలుకెళ్లే అవకాశం ఉంది.ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఐతే చివరికి కోర్ట్ తీర్పుతో అవినాష్ వర్గం వాళ్లు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇంకోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు లో అరెస్టైన ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సైతం హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వైఎస్ భాస్కర్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల వల్ల భాస్కర్ రెడ్డి కి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అయితే ఇదే కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్‌ లకు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: