గత కొన్ని రోజుల నుంచి ప్రేక్షకులు అందరిని అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ పోరు ప్రస్తుతం మరింత రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్లే ఆఫ్ కి సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయ్. ఇక ప్రతి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ పరవాలేదు అనిపించింది.


 ఉతురాజ్ కైక్వాడ్ తన కెప్టెన్సీ వ్యూహాలతో  జట్టును సమర్థవంతంగానే ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి మాత్రం వరస పరాజయాలతో సతమవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తర్వాత మ్యాచ్ లలో విజయాలపై దృష్టి పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. ఇలాంటి సమయంలో ఆ జట్టుకి బిగ్ షాక్ తగలబోతుంది. ఇక బౌలింగ్ కష్టాలు మొదలు కాబోతున్నాయి అన్నది తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి బౌలర్లు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు.



 ఇక ఇప్పుడూ జట్టు బౌలింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముస్తాఫిజర్ రెహ్మాన్, మోయిన్ అలీలు కూడా ఇక సిఎస్కే నుంచి తప్పుకోబోతున్నారు. తమ జాతీయ జట్టుకు ఆడేందుకు కొన్ని రోజులపాటు ఈ ఇద్దరు బౌలర్లు చెన్నై జట్టుకు దూరం కాబోతున్నారట. ఇప్పటికే గాయంతో దీపక్ చాహార్, జ్వరంతో బాధపడుతూ తుషార్ దేశ్పాండే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు శ్రీలంక బౌలర్ పతిరన, మహిషా తీక్షణ వీసా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా కీలక బౌలర్లు అందరూ కూడా దూరమవుతూ ఉన్న సమయంలో రానున్న మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ కి బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: