అయితే గతంలో మీడియాకు అత్యంత సన్నిహితుడు చంద్రబాబు. మీడియా సైతం ఆయన్ను ఎంతో గౌరవించేది. ఒక విధంగా చంద్రబాబు విజనరీ నాయకుడిగా గుర్తింపు పొందడంలో మీడియా పాత్ర ఉంది. అటువంటి చంద్రబాబు ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి అనేది జగన్ సొంత మీడియా. కరపత్రం లాంటిది. అటువంటి దానిని బహిష్కరించడం సహేతుకం అయినా.. టీవీ 9, ఎన్టీవీ లను దూరం పెట్టడం కొంత ప్రతికూలంగా మారింది. వాస్తవానికి ఈ రెండు ఛానళ్లు తటస్థంగా వెళ్తుంటాయి.
ఎప్పుడు అయితే ఈ టీవీ డిబెట్లకు టీడీపీ నేతలు హాజరు కావొద్దని ప్రత్యేక ఆదేశాలను టీడీపీ అధినేత జారీ చేశారో అప్పటి నుంచి జగన్ కు అనుకూలంగా వార్తల ప్రసారం మొదలు పెట్టాయి. ప్రస్తుతం ఈ రెండు ఛానళ్లకు ప్రేక్షకాదరణ ఉంది. కానీ జగన్ కి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటిని బ్యాన్ చేయడం ద్వారా చంద్రబాబు ఆయా ఛానళ్లలో కనిపించడం మానేశారు.
వాస్తవానికి డిబెట్ జరిగినప్పుడు రెండు వైపులా వాదనలు ఉండాలి. ఒక్కరే వన్ సైడ్ గా తమ గురించి చెప్పుకుంటూ ఉంటే జనాల్లో కూడా పెద్దగా ఆసక్తి ఉండదు. ఎవరి అనుకూల మీడియా వారికి ఉన్న సమయంలో తటస్థులను దూరం చేయడం ద్వారా వారు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు ఛానళ్లను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనదేనా.. ఓ సారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి