‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో ఊహించని ఘనవిజయం సాధించిన తరువాత దర్శకుడు సుకుమార్ కు ‘పుష్ప 2’ ఆలోచనలు మొదలయ్యాయి. ఈ సీక్వెల్ ప్రారంభం నుండి రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈమూవీ రాబోతున్న ఆగష్టు 15న విడుదల కాబోతున్న పరిస్థితులలో కేవలం బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా సినీ అభిమానులు అంతా ఈమూవీ విడుదల గురించి ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.



ప్రస్తుతం ఈమూవీ అనుకున్న తేదీకి విడుదల అవుతుందా అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వర్గాలలో రావడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఈమూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలచేయాలి కాబట్టి కనీసం మూడు నెలలు ముందుగా ఈమూవీ ప్రమోషన్ ను ప్రారంభించి తీరాలి. తెలుస్తున్న సమాచారం మేరకు మే నెలాఖరుకు పూర్తి కావలసిన ఈమూవీ షూటింగ్ జూన్ నెలలో కూడ కొనసాగే ఆస్కారం ఉంది అంటున్నారు.



దీనికికారణం ఈమూవీ చిత్రీకరణ విషయంలో సుకుమార్ తీసుకుంటున్న మితిమీరిన జాగ్రత్తలు అని అంటున్నారు. సాధారణంగా సుకుమార్ తాను తీసే సినిమాల సన్నివేశాల విషయంలో ఏమాత్రం రాజీ పడడు. ఒక సీన్ చిత్రీకరణ పూర్తి చేసిన తరువాత అవసరం అనుకుంటే మళ్ళీ అదే సీన్ ను రీ ఘాట్ చేసే అలవాటు సుకుమార్ కు ఉంది అంటారు.



‘పుష్ప 2’ పై ఉన్న భారీ అంచనాలతో అల్లు అర్జున్ కూడ గత రెండున్నర సంవత్సరాలుగా మరొక సినిమా చేయకుండా తన దృష్టి అంతా ‘పుష్ప 2’ పైనే పెట్టాడు. ఇప్పుడు అనుకోకుండా ‘పుష్ప 2’ విడుదల వాయిదా పడితే బన్నీ మరికొంత కాలం మరో సినిమాను చేయకుండా తన దృష్టి అంతా పుష్ప రాజ్ పాత్రతో పాటు అతడి గెటప్ పై ఉంచాలి. అయితే సుకుమార్ మాత్రం ప్రతి రోజు అర్థరాత్రి వరకు ఈమూవీని అనుకున్న తేదీకి విడుదల చేసి తీరాలి అన్న పట్టుదల పై ఉండటంతో ఈమూవీ అనుకున్న తేదీకి ఏదోవిధంగా విడుదలై తీరుతుంది అని అంటున్నారు..


 


మరింత సమాచారం తెలుసుకోండి: