అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ ఈనెల 15వ తేదీన మార్కెట్‌లోకి విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని సంస్థ సీఈవో భవీష్‌ అగర్వాల్ వెల్ల‌డించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స్కూటర్‌లో ఉండే ఫీచర్లు, బుక్‌ చేసుకున్నవారికి బండి ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంద‌నే విష‌యాల‌ను ఆగ‌స్టు 15న తెలియ‌జేస్తామ‌న్నారు.

ఆగ‌స్టు 15న మార్కెట్‌లోకి విడుద‌ల‌
జులై 15న ఓలా స్కూటర్‌ బుకింగ్స్ ప్రారంభమ‌య్యాయి. రూ.499లతో బుక్‌ చేసుకోవ‌చ్చు. తొలి 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ జ‌రిగి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో త‌యార‌వుతోన్న ఈ స్కూటర్‌పై ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఉంది.  వేగం, బూట్ స్పేస్‌, ఛార్జింగ్ విష‌యాల్లో అత్యుత్తమైనదిగా నిలిచే అవ‌కాశం ఉంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  ప‌దిరంగుల్లో అందుబాటులోకి రానున్న ఈ బండి రంగుల‌ను కంపెనీ వెల్ల‌డించింది.

బుక్‌చేసుకున్న‌న‌గ‌దు వెన‌క్కి
ఓలాను బుక్‌చేసుకున్న రూ.499 వెన‌క్కిచ్చేస్తారు. ప్రిబుక్ చేసుకున్న వారికే వీటిని ముందుగా డెలివ‌రీ చేస్తారు. దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త‌ల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. కీ లేకుండానే స్కూటర్ స్టార్ట్ అవుతోంద‌ని అంటున్నారు. మొబైల్ అప్లికేషన్ ఎలాగూ ఉంటుంది. ఓలా స్పీడ్ ఎంత? మైలేజీ ఎంత వ‌స్తుంది? ఫీచర్లేంటి?  లాంటి విష‌యాల‌ను తెలుసుకునేందుకు అంద‌రూ ఆస‌క్తి చూపించారు. క్యాబ్‌గా ప్రారంభ‌మైన ఓలా స‌ర్వీస్ సంస్థ క‌ర్ణాట‌క‌లో ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల త‌యారీ క‌ర్మాగారాన్ని నెల‌కొల్పుతోంది. కంపెనీ వెబ్‌సైట్లో ఉన్న వివ‌రాల ప్ర‌కారం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జి చేసుకునే అవ‌కాశం ఉంది. ఇది 75 కిలోమీట‌ర్ల వ‌ర‌కు వ‌స్తుంది. 100 శాతం ఛార్జింగ్ చేసుకుంటే 150 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే అవ‌కాశం ఉంది. బండి ప‌ది రంగుల్లో మెటాలిక్‌, పాస్టెల్‌, మ్యాట్ ఫినిష్‌లున్నాయి. జాతీయ ర‌హ‌దారుల‌పై కూడా దీన్ని ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

tag