దేశీయ విమానాలలో కరోనా నేపథ్యంలో అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కరోనా రెండో వేవ్ తీవ్రంగా ఉండటంతో అప్పటి పరిస్థితులలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కోసీటు గ్యాప్ ఇస్తూ ప్యాసెంజర్స్ ను కూర్చోవడానికి అనుమతి ఇచ్చేవారు. అదేవిధంగా ప్రయాణికులు విమానాశ్రయం లోకి రాగానే వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించేవారు. లేదా ప్రయాణికులు తమకు రెండు డోసుల వాక్సిన్ తీసుకున్నట్టు సంబంధిత పత్రాలు చూపడం వలన కూడా ఈ తరహా ప్రయాణాలు కొనసాగినవి. అయితే రానురాను కరోనా నెమ్మదితుండటంతో ప్రయాణికులను పూర్తిసామర్థ్యంతో కూర్చోబెట్టేందుకు సిద్ధం అయ్యారు. అయితే దానికి ముందు ప్రభుత్వం దేశీయ విమానాలలో ఇక ఆంక్షలు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆయా విమాన సంస్థలు పూర్తిస్థాయిలో ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అక్టోబర్ 18 నుండి దేశీయ విమానాలలో పూర్తి సామర్థ్యంతో ప్రయాణికులను అనుమతిస్తూ ప్రకటన జారీచేసింది. కరోనా తో ఈ సామర్థ్యం 85 శాతంగా ఉండేది. ఇటీవల ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కేంద్రాన్ని విమానయాన సంస్థలు కలవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.  కేంద్రం ఆదేశాల మేరకు ఆగష్టు 12-సెప్టెంబర్ 18 మధ్య విమాన సంస్థలు 72.5శాతం సామర్థ్యంతో, జులై 5-ఆగష్టు 12 మధ్య 65 శాతం సామర్థ్యంతో, జూన్ 1-జులై 5 మధ్య 50 శాతం సామర్థ్యంతో విమానాలను నడిపించారు. ప్రస్తుతం ఆంక్షలు అన్ని తీసేయడంతో 100 శాతం విమాన ప్రయాణాలకు ఆవకాశం ఉంది.  

ఈ నేపథ్యంలోనే విమానాలలో ప్రయాణించే మంత్రులు విషయంలో పాటించాల్సిన నియమాలు, అందించవలసిన సేవల పై కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.  దేశంలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు  ఈ నిబంధనలు పాటించాల్సిందని కేంద్రం స్పష్టం చేసింది. విమాన ప్రయాణాల్లో ఎంపీలు అసౌకర్యానికి గురవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ మేరకు నిబంధనలు తీసుకువచ్చినట్టు వారు తెలిపారు. ఎంపీలకు టి, కాఫీ, మంచి నీరు ఉచితంగా అందించాలి. విశ్రాంతి కోసం వారికి ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వాళ్ళు వెళ్లే వాహనాల కోసం విప్ పార్కింగ్ స్లాట్ లు కేటాయించాలని, సెక్యూరిటీ చెక్ సమయంలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే విమానంలో నచ్చిన సీట్లను వారికీ కేటాయించాలని కేంద్రం సిఫారసు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: