ఇక నేటి రోజుల్లో పోన్ పే, గూగుల్ పే, పేటియెమ్ వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ గురించి తెలియని వాళ్ళు అసలు ఉండరు. మన చేతిలో డబ్బు లేకపోయినప్పటికి బ్యాంక్ లో డబ్బు ఇంకా అలాగే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు డబ్బు ఇతరులకు డబ్బు పంపించాలన్న, లేదా ఏదైనా షాప్ లో వస్తువులు కొనుక్కోవాలన్న స్మార్ట్ పోన్ ఉపయోగించి పేమెంట్స్ యాప్స్ ద్వారా ఈజీగా మనీ చెల్లిస్తూ ఉంటాం. మోడీ ప్రభుత్వం ఈ క్యాష్ లెస్ డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశ పెట్టిన తరువాత ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు.ముఖ్యంగా ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం అనేది అమల్లోకి వచ్చిన తరువాత ప్రతిసారి బ్యాంక్ దగ్గరకు వెళ్ళి అవసరం అనేది తప్పింది. ఇంకా అలాగే బ్యాంకు ద్వారా మనం అమౌంట్ తీసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ చార్జెస్ కింద కొంత అమౌంట్ కూడా చెల్లించాల్సి వచ్చేది. కానీ ఈ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎలాంటి చార్జెస్ లేకుండానే మనీ చెల్లింపులు జరుగుతూ ఉండడంతో తక్కువ సమయంలో ఈ డిజిటల్ పేమెంట్స్ విధానానికి చాలా అలవాటు పడ్డారు ప్రజలు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్స్ విధానంలో కూడా ప్రజలకు పెద్ద షాక్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.మొబైల్ యాప్స్ ద్వారా జరిపే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కూడా చార్జెస్ ని విధించేందుకు ఆర్బీఐ ఇప్పుడు సిద్దమౌతోంది.


ఇక యూపీఐ లావాదేవీలపై ఏ విధంగా ఛార్జీలు విధించాలి అనే దానిపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు వార్తలు అనేవి వస్తున్నాయి. ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చే అవకాశం కూడా ఉందని జాతీయ మీడియాల్లో అనేక కథనాలు వస్తున్నాయి. మరి ఇదే గనుక నిజమైతే పోన్ పే ఇంకా గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిపే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతవరకు బ్యాంక్ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ అనేది చెల్లించాల్సి వచ్చేది.. ఇకపై పేమెంట్స్ యాప్స్ ద్వారా కూడా ఛార్జీలు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది కూడా ఈ విధానంపై చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని గట్టిగా ప్రోత్సహించిన మోడీ ప్రభుత్వం.. ఇక ఇప్పుడు వాటిలో కూడా ఛార్జీలు వేయడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై మోడీ ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: