కొంతమంది ఎంత మంచి కూర ఉన్నాగాని ఒక్క ముద్ద అయిన పచ్చడితో తినకుండా ఉండలేరు. అందుకే  ఈరోజు మీకోసం ఇండియా హెరాల్డ్ వారు ఒక మంచి పుల్లని  కమ్మగా కారంగా ఉండే  ఎంతో రుచికరమైన “టొమాటో నువ్వుల పచ్చడి”తయారీ విధానాన్ని మీకు పరిచయం చేస్తున్నారు. ఈ పచ్చడిని అన్నం, ఇడ్లీ, అట్టు, గారె, చపాతీ పూరీలలోకి కూడా తినవచ్చు.  చాలా రుచిగా ఉంటుంది.కాల్షియం తక్కువగా ఉన్నవారిని నువ్వులు ఎక్కువ తీసుకోమంటుంటారు వైద్యులు.  ఇలా నువ్వులు చేర్చి పచ్చళ్లు చేసుకున్నా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. నువ్వులకి బదులు వేరుశెనగపప్పు , వేపిన ఆవిశ గింజలు , పుట్నాల పప్పు , వేపుకున్న పచ్చిసెనగపప్పు కూడా వాడుకోవచ్చు .మరి ఆలస్యం చేయకుండా టొమోటో నువ్వుల పచ్చడి ఎలా తయారుచేయాలో చూద్దామా. !

కావాల్సిన పదార్ధాలు:

1/2 kg పండు టొమాటోలు

8 -10 పచ్చిమిర్చి

2 tbsp నువ్వులు

5 వెల్లూల్లి రెబ్బలు

1/4 tbsp మెంతులు

1 tbsp ధనియాలు

1 tsp జీలకర్ర

3 tbsps నూనె

ఉప్పు

తాలింపుకు

కరివేపాకు (One Sprig)

1/2 tsp ఆవాలు

2 tsps నూనె

1/4 tsp జీలకర్ర

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో  మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి, తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేపాలి. ఆఖరున నువ్వులు వేసి చిటచిట అనేదాకా వేపుకోండి. తరువాత అన్నిటిని  చల్లార్చి మెత్తని పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి వేసి మగ్గించుకోండి, పచ్చిమిర్చి మగ్గాక అందులో టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి.నాటు టొమోటోలు అయితే పచ్చడి పుల్లగా రుచికరంగా ఉంటుంది. టొమాటోలు పూర్తిగా మగ్గి గుజ్జుగా అవ్వాలి, అవసరమయితే నూనె కొంచెం ఎక్కువ పోయండి. నూనెలో టొమోటో ముక్కలు మగ్గితే రుచికరంగా ఉంటాయి.ఇప్పుడు మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, టొమోటో ముక్కలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు నువ్వుల పొడి వేసి మెత్తని పేస్టులా చేసుకోండి.తరవాత నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆ తాలింపును చట్నీ లో కలుపుకోండి.అంతే ఎంతో రుచికరమైన టొమోటో నువ్వుల పచ్చడి రెడీ అయినట్లే.. !!












మరింత సమాచారం తెలుసుకోండి: