ఇటీవల కాలంలో ఎంతో మంది యువత చిన్న చిన్న సమస్యలకే డిప్రెషన్లోకి వెళ్లి పోవడం జీవితం ముగిసి పోయింది అని భావించి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోతూ ఏకంగా తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపుతున్నారు. తల్లిదండ్రులు తోటి స్నేహితులు ఎంతలా సముదాయించేందుకు ప్రయత్నించిన చివరికి బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. బీహార్లో ఓ బాలిక చేసిన పనికి ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడా తల్లడిల్లిపోయారు.

 బీహార్లోని ముజఫర్పూర్ పరిధి భగవాన్ పూర్ లోని గణేష్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటున్న చంద్రమని లాల్  అనే వ్యక్తి భార్య కూతురుతో నివాసం ఉంటున్నాడు. అయితే కూతురు వయస్సు పదిహేనేళ్లు. అయితే ఒక హార్డ్వేర్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు సదరు వ్యక్తి. ఇతని కుమార్తె శ్రేయ ఇటీవలే మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసింది. అయితే 90 శాతం మార్కులు వస్తాయని ఆమె కుటుంబ సభ్యులు కూడా ఎంతో నమ్మకం పెట్టుకున్నారూ. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ఫలితాలలో ఆమెకు కేవలం 59 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. దీంతో సదరు బాలిక ఎంతగానో డిప్రెషన్లోకి వెళ్లి పోయింది. ఇటీవలే అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది బాలిక. రాత్రి భోజనం చేసి పడుకుంది. కానీ ఉదయం చూసేసరికి కనిపించలేదు. కానీ ఆమె గదిలో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్లో అమ్మ నాన్న క్షమించండి నాకు బతకాలని లేదు అందుకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను.. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తా.. మృతదేహం కోసం వెతుకొద్దు.. ఎవరైనా అడిగితే మా కూతురు గుండెపోటుతో మరణించింది అని చెప్పింది.  దీంతో ఆ తల్లిదండ్రులు  కూతురు బ్రతికి వస్తుంది అని ఎదురుచూడటం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: