నెరుడు పండ్లు.. ఎంత రుచికరంగా ఉంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ పండ్లు సీజనల్ పండ్లు. ఇంకా ఆలాంటి ఈ పండ్లతో చట్నీ చెయ్యచ్చు అనేదు మీకు తెలుసా? అది ఎంతో రుచికరంగా ఉంటుంది అనేది మీకు తెలుసా? ఎంతో రుచికరంగా ఉండే ఈ నెరుడు పచ్చడి ఎలా చెయ్యలి అనేది ఇక్కడ చదువి తెలుసుకోండి. ఇంట్లోనే చేసేయండి. 

 

కావలసిన పదార్థాలు...

నేరేడుపళ్లు - పది, 

కారం - పావు టీస్పూను,

ఇంగువ - చిటికెడు, 

ఉప్పు -  సరిపడేంత

నూనె - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను, 

మెంతులు - ఒక స్పూను

చక్కెర - ఒక స్పూను,

పసుపు - చిటికెడు, 

కరివేపాకు - గుప్పెడు.

తయారీ విధానం...

పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేసి బాగా వేగించాలి. అవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, కరివేపాకు అందులో వేయాలి. తర్వాత అందులో నేరేడు ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. అందులో కారం, చక్కెర వేసి కలిపిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి కడాయిపై మూతపెట్టి మూడు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆతర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి మారిస్తే నేరేడు పళ్ల పచ్చడి రెడీ అవుతుంది. ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలు పాటించి నేరేడు పచ్చడి చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: