కావాల్సిన ప‌దార్థాలు: 
అన్నం- రెండు కప్పులు
మష్రూమ్‌- ఎనిమిది
మిరియాల పొడి- అర టీస్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒక టీస్పూన్‌
సోయాసాస్- అర టీస్పూన్‌
పచ్చి బఠాణీ- అర క‌ప్పు

 

నెయ్యి- రెండు టీ స్పూన్లు
కరివేపాకు- నాలుగు రెబ్బలు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా అన్నం పొడి పొడిగా  చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక అందులో మష్రూమ్(పుట్టగొడుగులు)‌ ముక్కలు, ఉడి కించిన బఠాణీలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు వేసి దోరగా వేగించాలి.

IHG

ఆ త‌ర్వాత ఇందులో సోయాసాస్‌, మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు అన్నం కూడా అందులో వేసి ఐదు నిముషాలు వేయించి.. చివ‌రిగా కొత్తిమీర జ‌ల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్‌ రైస్‌ రెడీ అయినట్లే. దీనిని వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నోరూరించే మష్రూమ్‌ రైస్ మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. 

IHG

ఆరోగ్య పరిరక్షణలో మష్రూమ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

IHG 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: