కోడి గుడ్లు – మూడు ఉడకబెట్టండి. గరం మసాలా - రెండు టేబుల్ స్పూన్లు రెడీ చేయండి. మెంతి పొడి - ఒక టీ స్పూన్, ఆవ పొడి - ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్, ఉప్పు - ఒక టేబుల్ స్పూన్, ఆవాల నూనె - మూడు టేబుల్ స్పూన్లు రెడీ చేసుకోండి. అలాగే... కరివేపాకు – కొంచెం చాలు. కారం - ఒక టేబుల్ స్పూన్, ఆవాలు - ఒక టీ స్పూన్, జీలకర్ర - ఒక టీ స్పూన్, నిమ్మ కాయ - ఒకటి, కొత్తిమీర – కొంచెం చాలు.
తయారీ ఏ విధంగా అంటే... ఉడికించిన గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టి... స్టవ్ పై ఒక పాత్ర పెట్టి నూనె వేసి కొంచెం వేడి అయిన తర్వాత ఆవాలు... జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించిన గుడ్ల పై కత్తితో చిన్న చిన్న గాట్లు పెట్టి అందులో వేసుకోవాలి. చిన్న మంటపై ఉంచి వేయించాలి. కోడి గుడ్లు గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. గరం మసాలా, ఉప్పు, కారం వేసి మరి కాసేపు వేయించండి. చివరగా కరివేపాకు కొంచెం వేసుకుని దించండి. ఆ మిశ్రమం చల్లారిన తరువాత ఆవాల పొడి, మెంతి పొడి వేసుకోవాలి. అప్పుడు కొత్తిమీర వేసుకుని నిమ్మ రసం పిండుకొని కలుపుకుంటే కోడి గుడ్డు పచ్చడి రెడీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి