స్వీట్ కార్న్ చికెన్ కట్లెట్... చాలా మందికి తెలియదు కదూ... అసలు చికెన్ తో చాలా వంటలు చేసుకోవచ్చు. అసలు ఎం ఎం వంటలు చేసుకోవచ్చు అనేది తెలిసినా సరే కొందరికి చేసుకోవడం రాదు.  కాబట్టి మీకు స్వీట్ కార్న్ చికెన్ కట్లెట్ చెప్తాను. కావాల్సినవి ఏంటి అంటే...

చికెన్‌ – పావు కిలో(బోన్‌ లెస్‌ ముక్కలని మెత్తగా ఉడికించి  పెట్టండి. అలాగే స్వీట్‌ కార్న్‌ – 1 కప్పు, బంగాళ దుంప – 1 (ముక్కలు కోసి, మెత్తగా ఉడికించండి.) ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు కావాలి. పసుపు – పావు టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్‌, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత వేయండి. పాలు – 2 టేబుల్‌ స్పూన్లు కావాలి. అలాగే  మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – సరిపడా వేయండి. నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా ముందుగా మిక్సీ బౌల్‌ తీసుకుని అందులో చికెన్, స్వీట్‌ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముద్దలా చేసుకుని పెట్టండి.

 ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌ లోకి తీసుకుని, అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు జాగ్రత్తగా ఒక దాని తర్వాత ఒకటి వేసి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ ముద్దలా కలపండి. ఇప్పుడు నచ్చిన షేప్‌లో కట్లెట్స్‌ చేసుకుని.. ఒకసారి పాలలో ముంచి, మొక్కజొన్న పిండి పట్టించి.. నూనెలో డీప్‌ ఫ్రై చేయండి. అది అలా వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము లేదా ఉల్లిపాయ ముక్కలు వంటివి గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేస్తే చాలా రుచిగా ఉంటాయి అని చెప్తున్నారు. లేట్ చేయకుండా చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: