ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. చాలా అద్భుతమైన అమోఘమైన ఘుమ ఘుమ లాడే రుచి బిర్యానీ సొంతం.. పిల్లలు నుంచి పెద్దలు దాకా బిర్యానీ ని చాలా ఇష్టపడతారు.బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. అయితే అన్నిటికంటే గోంగూర బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది.ఈ బిర్యానీ శాఖాహారులు ఆనందంగా బాగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు.. ఈ బిర్యానీ రుచిని మాటల్లో వర్ణించలేము. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా బలమైన పౌష్టిక ఆహారం కూడా. ఇక ఈ రుచికరమైన పౌష్టికమైన గోంగూర బిర్యానీని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

ఇక రుచికరమైన ఘుమ ఘుమ లాడే గోంగూర బిర్యాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు..

బాస్మతి బియ్యం...ఒకటిన్నర కప్పు
గోంగూర...రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్టు...ఒక టీస్పూను
ఉల్లిపాయ....ఒకటి
పచ్చిమిర్చి...ఆరు
కొత్తిమీర.... కొంచెం
లవంగాలు... 4
దాల్చిన చెక్క...చిన్నముక్క
బిర్యాని ఆకు.. 1
నెయ్యి...ఒక టేబుల్‌ స్పూను
నూనె...ఒక టేబుల్‌ స్పూను
ఉప్పు..తగినంత.

రుచికరమైన ఘుమ ఘుమ లాడే అమోఘమైన  గోంగూర బిర్యానీ తయారు చేసే విధానం....

మొదటగా ఒక బాండీలో నూనె పోసి గోంగూరను మెత్తగా ఉడికించి రుబ్బి పక్కన బెట్టుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి పోసి వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, జీడిపప్పు, లవంగాలు వేసి వేగించాలి. ఇక ఆ తరువాత  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.తర్వాత గోంగూర వేసి బాగా కలపాలి. చివరగా బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోయాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దించితే సరి గోంగూర బిర్యానీ రెడీ. వేడివేడిగా గోంగూర బిర్యానీని తింటే అప్పుడు  కలిగే అనుభూతిని మనం  మాటల్లో చెప్పలేం.అంత అద్భుతంగా ఉంటుంది.. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: