సోషల్ మీడియా అనేది ప్రపంచంలో ఏం జరిగినా ఇట్టే తెలిసేలా చేస్తుంది.. అలాంటి సోషల్ మీడియా ను అడ్డు పెట్టుకొని చాలా మంది నేరాలకు అడ్డాగా మార్చుకున్నారు.. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కు ఆడవాళ్ళు బానిసలు అవుతున్నారు. సెల్ఫిని తీసుకోవడం అప్లోడ్ చేయడం వంటివి చేస్తున్నారు. అంతేకాదండోయ్.. మగవాళ్ళను మించిన రేంజులో ఆడవాళ్ళు దొంగతనాలు, దోపిడీలు చేయడమే కాకుండా తెలివి తేటలను ప్రదర్శించి మగాళ్ళను ముగ్గులోకి దించుతున్నారు.. అలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే వెలుగు చూశాయి.  తాజాగా ఇప్పుడు మరో ఘటన అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది.. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా ద్వారా అందాలను చూపిస్తూ ఆబ్బాయిల నుంచి లక్షల్లో డబ్బును రాబడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు పరిచయమైన ఓ మాయలాడి అతడిని నిండా ముంచేసింది. అతడి నుంచి ఏకంగా రూ.3.63 లక్షలు కొట్టేసింది. చివరికి వేధింపులు శ్రుతి మించడంతో తట్టుకోలేని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇటీవల ఇన్‌స్టాగ్రాం ద్వారా ఓ యువతి పరిచయం అయింది. అది క్రమంగా స్నేహంగా మారి మరింత ముదిరింది. తర్వాత ఇద్దరూ పరస్పరం ఫొటోలను మార్చుకున్నారు.

 

 

 


ఆ తర్వాత మరింత ముందుకెళ్లి ఇద్దరూ నగ్న వీడియోలను షేర్ చేసుకున్నారు. అతడి నగ్నవీడియోలు ఆమె చేతిలో పడిన వెంటనే ఆమె తన ప్లాన్‌ను అమలు చేసింది. తనకు డబ్బులు ఇవ్వకుంటే తన దగ్గర ఉన్న నగ్న వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీసులోని ఉద్యోగులకు పంపుతానంటూ బెదిరించింది. దీంతో ఆమె చెప్పినట్టు చేయకతప్పలేదు. వారం రోజుల్లో ఏకంగా రూ. 3.63 లక్షలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తాజాగా, మరో రూ.10 లక్షలు డిమాండ్ చేయడంతో నమోదు చేసుకున్న పోలీసులు మాయ లేడీ కోసం గాలిస్తున్నారు.జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పుకొచ్చారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి: