మహిళలు రోడ్డుపై తిరిగే స్వాతంత్రం ఇంకా రాలేదని చెప్పాలి. ఎందుకంటే బయటకు వెళ్తే రాక్షసుల చేతిలో ప్రాణాలను వదిలెయ్యడమో లేక మానాలు వదిలెయ్యడమో జరుగుతుంది . ఆటో ఎక్కాలంటే మాత్రం ఇప్పుడు వణికే పరిస్థితి ఎదురైంది. గమ్యాలకు చేర్చాల్సిన ఆటో డ్రైవర్లు రాక్షసుల్లా పశు వాంఛన తీర్చుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరిని కదిలించి వేస్తుంది. ఆటోలో వెళ్లాలంటే వణుకుపుట్టిస్తుంది.


అతని స్నేహితుడితో కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరిలో నివాసం ఉంటున్న ఓ యువతి గుంటూరు లోని ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. శుక్రవారం ఆస్పత్రిలో నైట్ డ్యూటీ ఉండటంతో.. రాత్రి 7 గంటల సమయంలో మంగళగిరి నుంచి తాను పనిచేస్తున్న ఆస్పత్రికి బయలుదేరింది. ఇందుకోసం ఓ ఆటోను ఆశ్రయించింది.

ఆటోలో ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్నేశాడు. అందుకు ఆటో డ్రైవర్ వెనకాల ప్రయాణికులు వస్తున్నారని చెప్పాడు. కాసేపటికే అక్కడ నిలిపి ఉన్న ఆటో వద్దకు మరో యువకుడు చేరుకున్నారు. దీంతో అనుమానపడిన.. యువతి ఏదో తేడా గా ఉందని కేకలు వేసింది. యువతి కేకలు వేయడంతో.. ఆటో డ్రైవర్, అతడి స్నేహితుడు ఆమె నోరు నొక్కి, కాళ్లు చేతులు పట్టుకుని ఆటోలోకి నెట్టారు. యువతి మెడ లోని బంగారు గొలుసును లాగి పడేసి.. యువతి పై లైంగిక దాడికి యత్నించారు. దీంతో అటుగా బైక్‌ పై వెళ్తున్న ఇద్దరికి అనుమానం వచ్చి.. ఆటో వద్దకు రావడంతో డ్రైవర్‌ తో పాటు, అతని స్నేహితుడు పరారయ్యారు. అనంతరం బాధిత యువతి నేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. ఇందుకు ఆటో వద్దకు వచ్చినవారు సహాయం చేశారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: