మార్కెట్లోకి ఏదైనా కొత్త వస్తూవు వచ్చిందంటే చాలు నకిలీ తయారుచేసే కేటుగాళ్లు పెరిగిపోతున్నారు.  మరోవైపు ఇక ఆ కొత్త వస్తువు పై నకిలీ దందా మొదలుపెడుతూ భారీగా దండుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో కేటుగాళ్లు బెడదా రోజురోజుకు ఎక్కువవుతోంది. అమాయకులని టార్గెట్గా చేసుకుని మాయ మాటలతో నమ్మించి అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో కరోనా భయాన్ని క్యాష్ చేసుకున్న కేటుగాళ్లు.. ఇక కరోనా మందు పేరుతో ఎంతో మంది దగ్గర భారీగా డబ్బులు దోచుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.



 ఇక ఇప్పుడు రూటు మార్చి వ్యాక్సిన్ పేరుతో సామాన్యుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. వ్యాక్సిన్ అందిస్తామంటూ కొన్ని హౌసింగ్ సొసైటీలనూ,కంపెనీలను సంప్రదిస్తూ మాయమాటలతో నమ్మిస్తున్నారు.  ఇక చివరికి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు ఇక ఇటీవలే ముంబైలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు మాయ మాటలతో నమ్మించి 390 మందికి నకిలీ వ్యాక్సిన్ వేశారు. అంతేకాదు వారి వద్ద నుంచి భారీగా డబ్బులు కూడా వసూల్ చేసారు. ముంబైలోని కందివాలి ప్రాంతంలో ఓ  సొసైటీలో మే 30 వ తేదీన వ్యాక్సింగ్ క్యాంపు నిర్వహించారు.



 ఈ క్రమంలోనే ఇక సొసైటీలోని 390 మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే కేటుగాళ్లు నకిలీ వ్యాక్సిన్లను ఇచ్చి ఒక్క టీకా కు పన్నెండు వందల యాభై రూపాయల చొప్పున వసూలు చేశారు. డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉడాయించారు. అయితే తమకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు  ఎలాంటి సందేశాలు రాకపోవడంతో అనుమానం వచ్చి నిందితులకు ఫోన్ చేసారు. వారి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.దీంతో మోసపోయామని గ్రహించారు. ఇక వెంటనే పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: