ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు అడుగడుగున వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కొంతమంది కామంతో కళ్లు మూసుకుపోయి ఆడపిల్ల కనిపిస్తేచాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక మరి కొంతమంది నమ్మకం గా నటించి చివరికి అమ్మాయిలను నట్టేట ముంచుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక ఒంటరి మహిళ పెళ్లై ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే ఆ మహిళ పై కన్నేశాడు ఓ యువకుడు.



 చేసేది తప్పు అని తెలిసినప్పటికీ పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ మహిళకు మాయమాటలు చెప్పి చివరికి సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో రోజుల పాటు ఇలా సహజీవనం చేస్తూ వచ్చిన ఆ యువకుడు అంతలో ఊహించని విధంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. తనతోపాటు తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని మహిళను వేధించడం స్టార్ట్ చేశాడు. చివరికి ఇక ప్రియుడి వేధింపులు తట్టుకోలేక పోయిన ఆ ఒంటరి మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్లలో వెలుగులోకి వచ్చింది



 జడ్చర్లకు చెందిన వెంకటేశ్ కి జిల్లా కేంద్రానికి చెందిన ఒంటరి మహిళ తో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే వెంకటేష్ కి పెళ్లయింది అయితే అతని భార్యకు అనారోగ్య సమస్య ఉంది అంటూ మహిళను నమ్మించాడు  అయితే ఇక మహిళ బిడ్డకు తల్లి అయినప్పటికీ కలిసి ఉండాలని ఇక మాయమాటలతో నమ్మించాడు. 8 నెలల పాటు సహజీవనం చేశాడు. కానీ ఆ తర్వాత తన స్నేహితుల మోజు తీర్చాలంటూ ఒత్తిడి తీసుకు రావడం మొదలుపెట్టారు. మహిళ మాత్రం ససేమిరా అంది. ఇక ఎన్ని హింసలు పెట్టినా ప్రియుడు చెప్పిన దానికి మాత్రం ఒప్పుకోలేదు. చివరికి ప్రియుడి వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: