కుమార్తెకు పెళ్లి జరిగింది. పెద్ద బాధ్యత అయిపోయిందనుకున్నాడు. నాగేష్ ఇంట్లో కుమారుడు మాత్రమే ఉంటాడు. కుమారుడు లేని సమయంలో కాలనీలలో ఉండే పలువురు మహిళలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. కొన్ని కుటుంబాల్లో దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. పలువురు కుమారుడు నాగరాజుకు అసలు విషయాన్ని వెల్లడించారు. ఈ విషయంపై నాగరాజు తండ్రిని నిలదీశాడు. అయినా నాగేష్ వ్యవహారంలో ఏలాంటి మార్పులేదు. దీంతో విసుగు చెందిన కుమారుడు నాగరాజు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి తలపై ఇనుపరాడ్డుతో చితకబాదాడు. దీంతో తండ్రి నాగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి సమీపంలో ఉన్న చెరువు కాలువలో తండ్రి శవాన్ని పడేశాడు. తెలివిగా పరారయ్యాడు. ఆతరువాత అసలు విషయాన్ని సమీప బంధువులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపు కాలువలో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి