ఆమెకు సొంత చెల్లెలు అయిన  తనతో పాటుగా వ్యభిచార రొంపిలోకి దింపింది అక్క. తనకు ఎంత ఇష్టం లేదు అని మొత్తుకున్నా బెదిరించి మరి వేరే వారి దగ్గరికి పంపేది. తాను ఆ పని చేయను అన్నా కానీ కఠినంగా వ్యవహరించి  తనతో ఆ పని చేయించి  చివరికి దారుణంగా హత్య చేసింది. అసలు ఏమి జరిగింది.. వివరాల్లోకి వెళితే.  వారంతా నలుగురు అక్క చెల్లెలు. ఇందులో ముగ్గురు అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి.

ఇంకో అమ్మాయి మైనర్ బాలిక. వీరికి తల్లిదండ్రులు లేకపోవడంతో  ఆ బాలిక అక్కలు అయినా రూపా దేవి, రాఖీ దేవి  దగ్గర వారి మైనర్ చెల్లెలు ఉండేది. ఇందులో అక్క రాఖీ దేవి జార్ఖండ్ రాష్ట్రంలో  వ్యభిచార వ్యాపారం నడిపిస్తోంది. తన భర్త తో పాటుగా ఇంకో చెల్లెలు కూడా ఇందులో  పాలుపంచుకుంది. అయితే వీరి కన్ను మరో చెల్లెలైన మైనర్ బాలికపై పడింది. వీరు చేసే పని చట్టవ్యతిరేకం అయినా కానీ మిగతా వారిని ఈ పనిలోకి దింపడానికి  వారు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. వీరీతోపాటు గానే ఆ మైనర్ చెల్లెలిని   కూడా వ్యభిచార రొంపిలోకి దీపాలని భావిస్తున్నారు. కానీ బాలిక  దానికి విరుద్ధంగా ప్రవర్తించింది. అయినా ఆ అమ్మాయిని బలవంతం చేసి  తన చెల్లెలు యొక్క భర్తతో కలిసి వ్యభిచార రొంపిలోకి దింపింది అమ్మాయికి ఇష్టం లేకుండానే కస్టమర్ దగ్గరికి పంపేవారు. అయినా ఆ మైనర్ బాలిక ఒప్పుకోలేదు. చివరకు అమ్మాయిని కొట్టి తిట్టి ఆ పనికి అలవాటు చేశారు.  ఇది అసలు ఇష్టం లేనటువంటి ఆ బాలిక అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని తను ఒకరిని లవ్ చేస్తున్నాను అని వారికి చెప్పేసింది. కానీ దీనికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. నువ్వు ఈ వ్యభిచార వృత్తిలోనే ఉండాలని  ఒత్తిడి కూడా తీసుకు వచ్చారు.  అయితే ప్రేమికుడి మాయలో పడిన ఆ బాలిక అక్కడినుంచి పారిపోతుందని భావించిన అక్క రాఖీ దేవి  తన భర్తతో కలిసి ఆ అమ్మాయిని చంపాలని ప్లాన్ వేసింది.

 ఈ తరుణంలోనే  ఆమెపై  చాలాసార్లు  అత్యాచారం చేయించింది. దీన్ని అదునుగా తీసుకున్నటువంటి నితేష్, ప్రతాప్ అనే వ్యక్తులు ఆ బాలికపై చాలాసార్లు లైంగిక దాడి చేశారు.  చివరికి ఆ బాలికను హత్య చేసి  ఉరి తీశారు. ఆమె  శవాన్ని ఎవరికీ తెలియకుండా ఆటోలో సోనాల్ డ్యాం దగ్గరికి తీసుకెళ్లి ఒక నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. మళ్లీ ఏం తెలియనట్టు ఇంటికి వచ్చేసారు. కానీ ఇటీవల  ఆ బాలిక శవం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు ప్రారంభించారు. చివరికి సొంత అక్కే బాలికను హతమార్చింది అని తెలుసుకొని  ఆమెను, వారికి సహకరించిన వారందరి పై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: