ఏంటో ఈ లోకం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకీ గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఎంతో జ్ఞానం సంపాదిస్తున్న జనాలు  చిన్న చిన్న విషయాలలో మాత్రం గొప్పగా ఆలోచించలేక పోతున్నారూ. అంతేకాదు ప్రాణాలకు ఇటీవలి కాలంలో మనుషులు అసలు విలువ ఇవ్వడం లేదు. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ బలవంతంగాప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఏదో పెద్ద సమస్య వచ్చింది ఇక ఆ సమస్యనుంచి బయట పడటం మావల్ల కాదు అనుకోవడం కాదు.. గట్టిగా తలుచుకుంటే తీరిపోయే సమస్యలకే జీవితం ముగిసి పోయింది అంటూ భావిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.



 ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఆత్మహత్య ఘటనలు చూస్తే మనిషి ఆలోచనా తీరు ఎటు పోతుందో అని కొందరు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఇలా వరుసగా ఆత్మహత్యలు వెలుగులోకి వస్తూ ఉండటంతో ఆందోళనలో మునిగిపోతున్నారు జనాలు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలిసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఇంత చిన్న కారణానికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతనికి పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది. అయితే ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి మాత్రం సెట్ అవటం లేదు. దీంతో బాధతో మద్యానికి బానిసగా మారిపోయాడు యువకుడు.


 ఎవరికి పెళ్లి అవడం లేదు అన్న బాధతో సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రోడ్ నెంబర్ సెవెన్ లో నివసించే ప్రవీణ్ అనే 30 ఏళ్ల యువకుడు జిరాక్స్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.  ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఇక ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి మాత్రం కుదరడంలేదు. దీంతో ఇక నాకు జీవితంలో పెళ్లి కాదు అంటూ మానసికంగా కుంగిపోయాడు. మద్యానికి బానిస గా మారి పోయాడు. ఇక ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బయటికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఊరికి వేలాడుతూ విగతజీవిగా ఉన్న కొడుకుని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: