ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మహిళలు ఏకంగా పిల్లి కరవడం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాస్త స్థానికులు అందరినీ ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది.. ఇలా పిల్లి కరిచిన ఇద్దరు మహిళలు రెండు నెలల అనంతరం ఒకే రోజున ప్రాణాలు వదిలిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కాస్త వివరాల్లోకి వెళితే.. వేముల మడ దళితవాడలో ని విశ్రాంత కండక్టర్ సాలి భాగ్య రావు భార్య కమలను ప్రైవేట్ వైద్యుడు బొడ్డు బాబు రావు భార్య నాగమణినీ రెండు నెలల క్రితం ఒక పిల్లి కరిచింది.
కుక్క కరిస్తే ప్రాణాలు పోతాయి కానీ పిల్లి కరిస్తే ఏం కాదులే అనుకున్నారు ఇద్దరు మహిళలు. అయినప్పటికీ ముందు జాగ్రత్త లో భాగంగా వైద్యుడిని సంప్రదించి వారికి ఇంజక్షన్ ఇచ్చారు. ఇక గాయాలు తగ్గడానికి మందులు కూడా వాడారు. కొన్ని రోజులకు ఉపశమనం కలిగింది. కానీ నాలుగు రోజుల క్రితం ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో వెంటనే మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరారు నాగమణి... విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది మరో మహిళా. అయితే నాగమణి చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందగా... కమల శనివారం ఉదయం 10గంటల సమయంలో మరణించింది. పిల్లి కలవడంతో ఇద్దరికీ రాబిస్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఇద్దరు మహిళలను కరిచిన పిల్లి కుక్క కాటుకు గురైందని వైద్యులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి