ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త హాట్ టాపిక్ ఏంటంటే—డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పెద్దలు పక్కన పెడుతున్నారా? అనే ప్రశ్న. సోషల్ మీడియా, పాలిటికల్ సర్కిల్స్‌లో ఈ విషయం చర్చించబడుతున్న తీరు చూస్తే రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత టిడిపి–జనసేన–బీజేపీ కూటమి అధికారం లోకి వచ్చాక, పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. జనసేన అధినేత తీసుకున్న నిర్ణయాలు, కూటమి నిర్మాణంలో ఆయన ప్రదర్శించిన పొలిటికల్ గేమ్ ఆయనను దేశవ్యాప్తంగా కూడా ఫోకస్‌లోకి తీసుకువచ్చాయి. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలు సభల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.


అయితే…ఇటీవల రాజకీయ పరిస్థితుల్లో కొన్ని  పరిణామాలు వేరే కథ చెబుతున్నాయి అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బీహార్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించకపోవడం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా పిలుపు రాకపోవడం ఇంకా ఆ డౌట్లు పెద్దవి చేసింది. మోదీ, బీజేపీ నేతలు ఇటీవల ఇచ్చిన ప్రసంగాల్లో పవన్ పేరుకు ప్రస్తావన తగ్గిపోవడం అభిమానులను బాధ పెట్టిమది. అదే సమయంలో లోకేష్‌ను పొగడ్తలతో హైలైట్ చేయడం ఇది పొలిటికల్ గ్రమ్ అంటూ అందరు మాట్లాడుకునేలా చేసింది. ఈ సంఘటనలన్నీ కలిసి చూస్తే “పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పెద్దలు సైడ్ చేస్తున్నారా?” అనే సందేహం ప్రజల్లో మరింత బలపడుతోంది.



రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం— ఇది పూర్తిగా బీజేపీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీలో భాగమై ఉండొచ్చు, లేదా ఏపీలో కూటమి  శక్తి సమీకరణాలు మారుతున్న సంకేతం కావచ్చు. కొందరు విశ్లేషకులు మరింత ఘాటుగా మాట్లాడుతూ—పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో సోషల్ మీడియా లోనూ హాట్ డిబేట్ ఇదే— “బీజేపీ నిజంగానే పవన్ కళ్యాణ్ నుండి దూరంగా వెళ్తుందా?”..“అలా అయితే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావమేంటి?”..ఏదేమైనా, ఈ చర్చలు, ఈ సందేహాలు, ఈ పొలిటికల్ నేరేటివ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెంచుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ముందుకు ఎలాంటి వ్యూహంతో వస్తారన్నది చూడాలి… అదే ఇప్పుడు పాలిటికల్ సర్కిల్స్‌లో రెడ్ హాట్ టాపిక్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: