నేటి రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో మొబైల్ అనేది ఎంతో కీలకంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి రోజుల్లో మనుషులు మొబైల్ కి బానిసలుగా మారిపోతున్న తీరు చూస్తుంటే ఒకప్పుడు మొబైల్ లేకుండానే బాగుండేదేమో ఎందుకంటే మనుషుల మధ్య బంధాలు బాగుండేవి.. ఒకరిని ఒకరు నవ్వుతూ పలకరించుకునే వారు కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి మొబైల్ లోకంగా  మారిపోయింది. పక్కన ఎవరున్నా ఇక ఏ పనిలో ఉన్నా మొబైల్ లో కాలక్షేపం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యింది. పక్కన ఉన్న స్నేహితులను కాదని ఎక్కడో ఉన్న స్నేహితులతో మొబైల్ లో చాటింగ్ లు చేస్తూ ఉండడం చేస్తూ ఉన్నారు నేటి రోజుల్లో జనాలు.


 ఇక మనిషి అవసరాలు తీర్చే ప్రతి ఒక్కటి కూడా మొబైల్లో దొరుకుతూ ఉండటంతో ఇక బయట ప్రపంచంతో పని లేకుండా పోయింది. మైదానంలో ఆడాల్సిన గేమ్స్ అన్ని కూడా మొబైల్ లోనే ఆడేస్తున్నారు. షాప్ కి వెళ్లి కొనాల్సిన అన్ని వస్తువులను మొబైల్ లోనే కొనేస్తున్నారు. కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన చదువులను మొబైల్లోనే చదివేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మొబైల్ లోనే జరిగిపోతున్నాయి. దీంతో ఇలా మొబైల్ వాడకం ఎక్కువై మొబైల్ కు బానిసలుగా  మారిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతుంది. కనీసం ఒక్క నిమిషం పాటు చేతిలో మొబైల్ లేకపోయినా కూడా ఏదో కోల్పోయినట్టు గా ఫీల్ అయిపోతున్నారు.


 ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అరచేతిలో మాత్రం మొబైల్ వుండాల్సిందే. ఇలా మొబైల్ వాడకం కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదికి తెస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. శంకర్పల్లి మున్సిపాలిటీలో చార్జింగ్ పెట్టి ఓ యువకుడు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో షాక్ కొట్టి చివరికి మృతి చెందాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన భాస్కర్ జ్యోతి నాథ్ బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం శంకర్పల్లి కి వచ్చాడు. ఎలక్ట్రిషన్ గా పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇటీవలే రాత్రి గదిలో ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇక ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అతనికి షాక్ తగిలింది. ఈ క్రమంలోనే భాస్కర్ చేతులు చెవులు కాలిపోయాయి. స్నేహితులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: