సాధారణం గా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం.. కానీ ఇటీవల కాలం లో మాత్రం ఎంతో మంది అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అటు అధికారులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అటు స్మగ్లర్లు మాత్రం సరి కొత్త దారులను వెతుకుతూ పోలీసులకు షాకిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. అయితే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా చూసిన తర్వాత స్మగ్లర్లు మరింత కొత్తగా ఆలోచిస్తున్నారు. రెచ్చి పోయి మరీ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే శేషాచలం అడవుల నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెన్నై హార్బర్ నుంచి చైనా జపాన్ లో అక్రమం గా తరలి  పోతుంది ఎర్ర చందనం. అయితే పుష్ప సినిమా లో మిల్క్ ట్యాంకర్ను ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం ఎంచుకుంటాడు పుష్పరాజ్. ఇక్కడ స్మగ్లర్లు  మాత్రం పుష్పరాజ్ ను మించి పోయారు. ఏకంగా అంబులెన్సు ను అక్రమ రవాణా కోసం ఎంచుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్కు పోలీసుల కళ్లుగప్పి దాటించేందుకు ప్రయత్నించారు. కానీ చివరికి పోలీసులు చాకచక్యం గా స్మగ్లర్లను అరెస్టు చేశారు.


 ఇక వారి వద్ద నుంచి 71 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పోలీసులకు అందిన సమాచారం మేరకు వేలూరు రోడ్డు లోని మాపాక్షి మలుపు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అటువైపుగా వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్  వాహనాన్ని గుర్తించి  తనిఖీలు చేయగా ఏకంగా ఎనిమిది మంది ఎర్ర చందనం కూలీలతో పాటు ఇద్దరు మేస్త్రీలు ఒక డ్రైవర్ కూడా ఉన్నారు. 50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక చెన్నై బెంగుళూరు రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: