పచ్చటి పల్లెటూరు పరువు హత్య తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుమార్తె ఒక యువకుడిని ప్రేమించడమే ఆమె పాలిట మృత్యు శకటం గా మారిపోయింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే దారుణంగా గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం లోని ఏజెన్సీ గ్రామంలో నాగర్ కొండ లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అని చెప్పాలి. నాగల్ కొండ లో నివాసం ఉంటున్న పవార్ సావిత్రిబాయి- దేవి దాసులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.


 పెద్ద కుమార్తెకు వివాహం కాగా కుమారుడు ఆదిలాబాద్ లో ఉంటూ చదువుకుంటున్నాడు.  ఇక చిన్న కుమార్తె రాజేశ్వరి అదే గ్రామానికి చెందిన షేక్ సలీం అనే యువకుడిని ప్రేమించింది. కొన్నాళ్ళు ఇద్దరు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించరు అని భావించి 45 రోజుల కిందట ప్రేమికులు  రహస్యంగా ఇంట్లో నుంచి పారిపోయి మహారాష్ట్రకు వెళ్లారు. ఈ క్రమంలోనే కూతురు ని ఆలం కిడ్నాప్ చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. ఇక పోలీసులు విచారణ జరిపి ఇద్దరి ఆచూకీ కనుగొని ఆ అమ్మాయి ని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ కేసులో సదరు యువకునీ డు రిమాండ్కు తరలించారు.


 అప్పటి నుంచి  పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో గొడవ పడుతూ వచ్చింది రాజేశ్వరి. చివరికి కూతురు తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు  తల్లిదండ్రులు. పరువు పోతుందని భావించారు. ఇక రాజేశ్వరి గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి గొంతు కోసి చంపేశాడు. ఇక ప్రేమను అంగీకరించక పోవడం వల్ల తమ కూతురు ఇలా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుందని కొత్త నాటకం మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి  తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: