అవును. మీరు విన్నది నిజమే. మరి ఆ తల్లి వారి పుత్రులకు యెంత ప్రేమ పంచిందో తెలియదు గాని, ఆమె లేని లోటుని వారు భరించలేకపోయారు. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లి, అమ్మలేని ప్రపంచంలో వుండబోమని ఆత్మహత్యతో వారు తనువులు చాలించారు. ఈ విషయం స్థానికంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో జరిగిన ఈ విషాదంతో మీడియా షేక్ అవుతోంది. కీసర మండలం రాంపల్లిదాయరలో నివాసముంటున్న మెట్టు శ్రీనివాస్ రెడ్డి, ప్రమీలకు, యాదిరెడ్డి (32), మహిపాల్ రెడ్డి (29) అనే ముగ్గురు కూమారులు, ఓ కూతురు ఉన్నారు.  
 
శ్రీనివాస్ రెడ్డి కొన్ని కారణాలతో మరో వివాహం చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో కూతురు మనస్తాపం చెంది కొన్ని నెలల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి ప్రమీల ఒంటరిగానే ఇంట్లో ఉంటుంంది. ఇక వారి కొడుకులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు గండిపేటలో ప్రైవేటు ఉద్యోగం, యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో మ్యూజిక్ ఇన్స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు. హార్మోనియంపై శిక్షణ ఇస్తూ, నెలకు ఒక్కొక్కరు రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలో ప్రమీల 8 నెలల క్రితం క్యాన్సర్‌తో మృతి చెందింది.
 
అంత్యక్రియల తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే, ఈనెల 21న యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి ఇంటిని శుభ్రం చేసేందుకు గ్రామానికొచ్చినట్లు స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం గండిపేటలో ఉన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని, అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోన్ చేసి చెప్పడంతో వారు వెళ్లి కిటికీలోంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని, మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయినట్లు స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు మృతులు రాసిన ఓ సూసైడ్ నోట్ ని పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: