ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దోమల బెడద పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అప్రమత్తంగా లేకపోయినా కూడా ఎంతోమంది ఇక చేతివాటం చూపిస్తూ అందినకాడికి దోచుకు పోతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో బ్యాంకుల వద్ద కాపుకాసి కూర్చుంటున్న దొంగలు ఎవరైనా బ్యాంకు నుంచి పెద్ద సంచితో బయటకు వచ్చారు అంటే చాలు ఇక వారిని వెంబడించి మరి వారి చేతిలో ఉన్న బ్యాగ్ కొన్ని నిమిషాల వ్యవధిలో కాజేస్తున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా దొంగతనం జరిగింది.


 ఏకంగా సినిమా రేంజ్ లో కొందరు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు అన్నది తెలుస్తుంది. ఏకంగా యాక్టివా వాహనంలో ఉన్న డబ్బును ముగ్గురు వ్యక్తులు దొంగలించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట పట్టణం నర్సాపూర్ కు చెందిన  రాములు ఏపీజీవీబీ బ్యాంకులో బ్యాంక్ మిత్ర గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాములు తన తల్లితో కలిసి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఏపీజీవీబీ బ్యాంకులో 2,49,000 విడుదల చేశాడు.

 ఈ క్రమంలోనే ఆ డబ్బులను ఇక తన యాక్టీవ వాహనంలోని డిక్కీలో పెట్టాడు. పక్కనే చెప్పుల దుకాణం లో షాపింగ్ చేసేందుకు వెళ్లి  తిరిగి వచ్చే సమయానికి తన వాహనం కనిపించకుండాపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.  అదే ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా. ముగ్గురు వ్యక్తులు యాక్టివా దొంగలించినట్లు తెలుస్తోంది. ఇక ఇలా వాహనాన్ని తీసుకెళ్లి సమీపంలో సఖి సెంటర్ వద్ద డబ్బులు కాచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు యువకులు ఎవరు అనేది కనిపెట్టే పనిలో పడ్డారు. బ్యాంకుకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir