ఇటీవలి కాలంలో సహజీవనం అనేది కామన్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కోర్టు నుంచి కూడా అనుమతులు ఉండటంతో ఎంతో మంది యువత ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటాం అనే కారణంతో పెళ్లికి ముందే సహజీవనం చేయడం లాంటివి కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఇలా పాశ్చాత్యపు అలవాటైన సహజీవనం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటోంది సదరు మహిళ. కాగా ఆమెకు ఒక వ్యాపారి తో పరిచయం ఏర్పడింది.


 కొన్నాళ్ళకి ఇద్దరి మధ్యా స్నేహం కూడా కుదిరింది. ఇంకేముంది సహజీవనం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. సహజీవనం  కోసం ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత ఒకే చోట ఒకే ఇంట్లో కలిసి జీవించడం మొదలు పెట్టారు. కానీ నాలుగు నెలల్లో ఇద్దరి మధ్య సమస్య తలెత్తింది. తర్వాత వ్యాపారి చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. రాజస్థాన్లోని జైపూర్కు పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హతోజ్ కర్దాని  ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ భర్త చనిపోవడంతో పిల్లలతో ఉంటుంది. ఆమెకు ఆయుబ్ ఖాన్ అనే వ్యాపారి తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఇక ఒప్పందం ప్రకారం సహజీవనం చేయడం మొదలుపెట్టారు.


 ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు సదరు వ్యాపారి. పలుమార్లు ఆమె కు డబ్బులు అప్పుగా కూడా ఇచ్చేవాడు. అయితే ఇటీవలే సొంతూరికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు దూరంగానే ఉంటున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో మోసపోయాను అని గ్రహించిన సదరు మహిళ న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: