ఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు కాస్తయిన విలువ ఇవ్వని మనుషులు ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారూ అన్న విషయం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల ద్వారా అర్థమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఒకసారి మూడుముళ్ల బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కట్టుకున్న వారే ప్రపంచం అన్న విధంగా బ్రతకాలి.. కట్టుకున్న వారికి కష్టసుఖాల్లో తోడు ఉంటూ  ఎంతో ఆనందమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది బంధాలను బంధుత్వాలను మరిచిపోయి నీచమైన పనులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 పెళ్లయి భర్త పిల్లలు ఉన్నప్పటికీ ఎంతో మంది ఇక పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పాలి.  ఇలా అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజుల్లో ఎన్నో హత్యలు ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో షాహాజీ నగర్ లో ఉండే కవిత అనే 34 ఏళ్ల మహిళ పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే భర్త మరణించడంతో కుట్టు మిషన్ పనిచేసుకుంటూ ఇక కుటుంబ పోషణ చూసుకుంటుంది కవిత.


 ఈ క్రమంలోనే కవితకు దగ్గరి బంధువు అయినా రాకేష్ శ్యామ్ రావు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.  పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే పెద్ద మనసు  చేసుకున్న రాకేష్ కవితను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇక ఇదే విషయం కవితకు చెప్పాడు. అయితే కవిత మాత్రం పెళ్లికి నిరాకరించింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పెళ్లి చేసుకుంటే సభ్య సమాజం ముందు తల ఎత్తుకోలేను అంటూ చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన రాజేష్ కవితను ధారణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: