
పరాయి వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించడమే కాదు ఏకంగా సొంత వారి విషయంలో కూడా ప్రేమ జాలి దయ అనేది లేకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే సొంతవారినే చిత్రహింసలకు గురి చేస్తూ నేటి రోజుల్లో ప్రతి ఒకరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో చిన్న చిన్న గొడవలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
సాధారణంగా భార్య రోజు వచ్చే సమయం కంటే కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ఎందుకు లేట్ అయింది అని భర్త ప్రశ్నించడం సర్వసాధారణం. అయితే ఇలా ప్రశ్నించడమే ఆ భర్త పాలిట శాపంగా మారిపోయింది. ఎందుకు లేటుగా వచ్చావని ప్రశ్నించినందుకు భర్తపై యాసిడ్ పోసింది భార్య . ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. కూపర్ గంజి ప్రాంతంలో నివసించే దబ్బు అనే వ్యక్తి తన భార్య పూనం ను ఎందుకు లేట్ అయింది అంటూ అడిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు మహిళ భర్త మొఖంపై యాసిడ్ పోసింది. దీంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.