
ఇలా మనిషి జీవితం టెక్నాలజీతో ఎంతో విలాసవంతంగా మారింది. కానీ అదే సమయంలో పెరిగిపోయిన టెక్నాలజీ అటు అనుకోని సమస్యలను తెచ్చిపెడుతుంది అన్నది మాత్రం వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని గద్దల్ల కాచుకుని వేచి చూస్తున్న సైబర్ నేరగాలు ఎవరైనా చిన్న తప్పు చేశారు అంటే చాలు దాన్ని క్యాష్ చేసుకొని ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఇటీవల కాలంలో సెటప్ బాక్స్ కి రీఛార్జ్ చేయడం అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు.
కానీ ఇలా సెట్ టాప్ బాక్స్ రీఛార్జ్ చేయడమే ఇక్కడ ఒక మహిళకు శాపంగా మారిపోయింది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని చివరికి భారీగా డబ్బులు పోగొట్టుకుంది. ముంబైకి చెందిన 47 ఏళ్ల మహిళా సెటప్ బాక్స్ కు 931 రూపాయలు రీఛార్జ్ చేసిన చానల్స్ రాకపోవడంతో గూగుల్ లో కనిపించిన కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేసింది. ఆ రోజు కాల్ కలవలేదు. కానీ మర్నాడు ఒక వ్యక్తి కాల్ చేసి కస్టమర్ కేర్ అంటూ ఆమె మొబైల్ లో రిమోట్ యాక్సిస్ కంట్రోల్ యాప్ ని డౌన్లోడ్ చేయించి ఇక చివరికి ఆమె ఖాతా నుంచి 81 వేల రూపాయలు కాజేసాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.