ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒకరిలో కూడా కలుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది విషయంలో విధి కక్ష గట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. దీంతో ఊహకందని రీతిలో మరణం సంభవిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సంతోషంగా ఉన్న ఎన్నో కుటుంబాలను ఇలా విధి చిన్నచూపు చూసి చివరికి విషాదంలో ముంచేస్తూ ఉంటుంది. ఇలాంటి తరహా ఘటనలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ అందరిని షాక్ గురి చేస్తూ ఉంటాయి.


 ఇక ఇటీవల కాలంలో ఎన్నో ప్రాణాంతకమైన మహమ్మారి వ్యాధులు జనాల ప్రాణాలు తీసేందుకు పంజా విసురుతూ ఉంటే.. ఇక మరోవైపు అనూహ్య ఘటనలు ఊహించిన రీతిలో ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. అభం శుభం తెలియని చిన్నారి విషయంలో కూడా విధి కాస్తయినా జాలి చూపించలేకపోయింది. ఈ క్రమంలోనే తమకు కొడుకు పుట్టాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉండగా.. ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయింది విధి. చివరికి అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారిని దూరం చేసి ఆ తల్లిదండ్రులను శోకసంద్రంలో  ముంచేసింది. ఏకంగా ముఖంపై గేద పేడ వేయడంతో ఆరు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సత్రారి గ్రామంలో ఉండే దంపతుల కొడుకు ఆరు నెలల ఆయుష్ విధి చిన్నచూపు చూడటంతో ప్రాణాలు కోల్పోయాడు. తల్లి నిఖిత చిన్నారి ఆయుష్ ను పశువుల పాక దగ్గర పడుకోబెట్టి.. పనులు చేయించుకుంటుంది  కాసేపటికి చిన్నారి ముఖంపై పేడ ఉండడంతో గమనించి తల్లి దానిని తొలగించి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. పేడ ముఖంపై పడటం వల్ల ఊపిరాడకపోవడంతో చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఇక తల్లిదండ్రులు అరణ్య ఆరోధనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: