ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుంది అని ఊహించడం కూడా చాలా కష్టంగానే మారిపోయింది. ఎందుకంటే ఒక్కసారి తల్లి కడుపులో నుంచి భూమ్మీదికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం వస్తేనో లేదంటే ఒక పెద్ద ఆరోగ్య సమస్య వస్తేనో ప్రాణాలు పోయేవి అని అందరూ నమ్మేవారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలను చూసిన తర్వాత.. ఇలా కూడా మనుషుల ప్రాణాలు పోతాయి అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.



 ఇప్పటికే ఎన్నో రకాల ప్రాణాంతకమైన వైరస్లు మనుషులపై పంజా విసురుతూ  ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయ్. ఇక మరోవైపు సడెన్ హార్ట్ ఎటాక్ లు అంటూ ఏకంగా మనుషులు చూస్తూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకోవైపు అనూహ్యమైన రీతిలో చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పాలి. అయితే కొన్ని ఘటనలను చూసిన తర్వాత కొంతమంది విషయంలో విధి నిజంగానే కక్ష కట్టినట్లుగా వ్యవహరించిందేమో అని అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇక్కడ వెలుగు లోకి వచ్చిన ఘటన చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనిపిస్తుంది. భవిష్యత్తు లో ఎన్నో ఆశలపై వివాహ బంధం లోకి అడుగు పెడుతూ ఉంటారు వధూవరులు. ఇక్కడ వధూవరులు ఇలాగే కోటి ఆశల తో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టారు. కానీ వారి విషయం లో విధి చిన్నచూపు చూసింది. ఏకంగా వివాహ బంధం లోకి అడుగు పెట్టిన కాసేపటికి.. కొత్త జంటను మృత్యువు మింగేసింది. ఈ విషాదకర ఘటన ఛత్తీస్గఢ్లోని జాంబ్ గిరి జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి తంతు ముగిసింది. తర్వాత వధూవరులు, బంధువులు కార్ లో వెళ్తున్నారు. వారి కారును ట్రక్కు ఢీకొట్టింది  వధువు స్పాట్లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన వరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: