వీళ్లు మిగిలిన ముస్లిమ్స్ అందర్నీ మతపరమైన దాడులకు తట్టుకోలేక, ధైర్యం లేక మతం మారిపోయిన వాళ్ళు గా భావిస్తారని తెలుస్తుంది. భారతదేశం లోని, అలాగే పాకిస్తాన్ లోని అలాంటి ముస్లింలను వీళ్లు కాఫియర్లు అని భావిస్తారట. వాళ్లు అజ్ఞానులని, ధైర్యం లేని వాళ్ళని భావించి ఈ అరబ్ ముస్లిమ్స్ వీళ్ళ ధైర్యం చూపించుకోవడానికి తరచుగా గొడవలు చేస్తూ ఉంటారని సమాచారం.
పాకిస్తాన్ కి బాగా సపోర్ట్ చేసే దుబాయ్ కి మొన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడం జరిగింది. దుబాయ్ నుండి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు పాకిస్తాన్ కు చేరింది. మనది కాని దేశానికి వెళ్లి అక్కడ దాడులు చేసి ఆ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకునే వాదాన్ని సీమాంతర తీవ్రవాదం అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ అరబ్ దేశాలకు తమపై సీమాంతర తీవ్రవాదం జరుగుతుందని చెప్తుందని సమాచారం.
అది కూడా తాలిబన్లు ఈ సీమాంతర తీవ్రవాదాన్ని జరుపుతున్నారని చెప్తుందట. కానీ ఇప్పటివరకు మన భారతదేశం పైన దాడులు చేసి మన దేశాన్ని మత రాజ్యంగా మార్చాలనుకున్న దేశం పాకిస్తాన్. ఇక్కడ చర్చనీయాంశమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన అరబ్ దేశాలు ఇప్పుడు భారత్ తో కలిసి సీమాంతర తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒప్పందంపై సంతకాలు చేశాయట. మోడీ చేసిన ఈ చర్య పై పాకిస్తాన్ ఇప్పుడు మండి పడుతుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి