ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది వాళ్లు వాళ్లు తేల్చుకోవాల్సిన విషయం, అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య జరుగుతున్న విషయం ఇది.  ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏ తప్పూ చేయకపోతే దానికి అనుగుణంగా జడ్జ్మెంట్ ఇస్తుంది కోర్టు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆయనను ఇరికిస్తే దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది అని కొంతమంది అంటున్నారు.


అయితే ఇక్కడ  తెలుగుదేశం పార్టీ చేసే తప్పు ఏంటంటే చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోదు, ఎందుకు ఆయనని రిలీజ్ చేయనివ్వదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టదు అని అడగడం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వర్గాల వారు ఈ విధంగా అంటున్నారట.  వారందరూ చదువుకున్న వారే కదా మరి వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఆలోచించలేకపోతున్నారు ఈ విషయంపై అని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు.


వాళ్లు అనేది ఏమిటంటే కేంద్రం జోక్యం చేసుకునేలా ఉంటే మొన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి విషయంలో కూడా జోక్యం  చేసుకునేది కదా అంటున్నారు. అంతే కాకుండా గతంలో సోనియాగాంధీ, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, ఇంకా తమిళనాడులో జయలలితల అరెస్టు విషయంలో కూడా జోక్యం చేసుకునేది కదా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా అని అడుగుతున్నారు.


చదువు ఉన్నా తెలివితేటలు ఎక్కువవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలే వస్తాయని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేయడం జరిగింది. గతంలో తనకు చేసిన దానికి ప్రతిఫలంగా  ఇదంతా చేస్తున్నాడు జగన్. ఇది అర్థం చేసుకోకుండా చంద్రబాబు మీద అభిమానంతో మధ్యలో కేంద్రాన్ని విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: