జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్లో మీడియా విషయం చిమ్ముతున్న వార్త 108 నిర్వహణ సరిగా లేదని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 లు ప్రవేశపెట్టారు. చాలా చక్కగా పని చేశాయి. ముందుగా వీటిని సత్యం రామలింగరాజు అనే వ్యాపార వేత్త ప్రవేశపెడితే దీన్ని వైఎస్ ఆచరణలోకి తీసుకువచ్చి ఉచితంగా ప్రజా సేవ చేసేలా వినియోగం లోకి తీసుకువచ్చారు.


ఆంధ్రలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టులను వేరే సంస్థలకు అప్పగించారు. అప్పుడు ఏమీ మాట్లాడని ఈనాడు, జ్యోతి ఎలాంటి కథనాలు రాయలేదు. తర్వాత జగన్ సీఎం అయ్యాక అరబిందో సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. దీంతో ఎల్లో మీడియా ఇక పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం  136 కోట్ల రూపాయాల వ్యయంతో 108 అంబులెన్స్ లను కొంటున్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో 3000 మందికి పైగా 108 అంబులెన్స్ లు రోజు వారీ సేవలు అందిస్తున్నాయి. 2020 జులై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 108 అంబులెన్స్ ల ద్వారాా 36 లక్షల మందికి ఇవి వాటి సేవలను అందించాయి. వీరిలో అత్యధికంగా 23 శాతం మంది గర్భిణులు ఉండగా.. 14 శాతం మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. రోడ్డు ప్రమాద బాధితులు 11 శాతం మంది ఉన్నారు. వాస్తవంగా 108 వెహికల్స్ కు 768 అంబులెన్స్ లు ఉన్నాయి. వీటి కోసం 589 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారు. కొత్తగా వీటి కొనుగోలు కోసం 136 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.


ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లలో 311 ఉన్నాయి. టోటల్ గా వీటి నిర్వహణ విషయంలో 3700 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఏడాదికి 172 కోట్లు 108 నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: