ఎప్పుడు ఏ లొసుగులు దొరుకుతాయా ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామా ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలపై ఏ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు.. వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచుతుంది అధికార పార్టీ. ఇలా ఒకరిపై ఒకరు నిఘా ఉంచుతారు. హైదరాబాద్ లోని వైసీపీ కార్యాలయం గురించి టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని మతాలు, కులాలు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఎంత మంది అనే తదతర వివరాలన్నీ వాలంటీర్ల ద్వారా సేకరించి హైదరాబాద్ లో ఉన్న ఐప్యాక్ టీంకు అందజేస్తున్నారని.. దీంతో వారు అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారని టీడీపీ  నేతలు ఆరోపించారు. ప్రజల డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇప్పుడు టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి బాబు గ్యారంటీ-భవిష్యత్తుకు ష్యూరిటీ అనే కరపత్రాలను పంచుతున్నారు. అయితే నేరుగా కరపత్రాలు పంపిణీ చేయకుండా ఆధార్, ఓటర్ కార్డులు తీసుకొని ఓటీపీ లు సేకరిస్తున్నారు. ఇదంతా ఎక్కడికి వెళ్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అయితే ఇదంతా లండన్ నుంచి మానిటర్ జరుగుతుందని జగన్ అనుకూల పత్రికలో రాసుకొచ్చారు.


ప్రజల వ్యక్తిగత సమాచారంతో చంద్రబాబు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. టీడీపీ శ్రేణులను ప్రజల ఇళ్లలోకి పంపించి వారి వివరాల్ని సేకరిస్తున్నారు. మభ్య పెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాకుండా దాన్ని లండన్ లోని సర్వర్ లో నిక్షిప్తం చేయడం ద్వారా ప్రజల భద్రతకు పెను ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వన్ టైమ్ పాస్ వర్డ్ సేకరించడం ద్వారా ఆర్థిక లావాదేవీల ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఓటీపీలు సేకరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: