
ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎవరికీ మేలు చేయని ముఖ్యమంత్రిని రాష్ట్రానికి ఎందుకని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అమరావతి రాజధానికి జనసేన కట్టుబడి ఉందన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్.. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు అని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతుల త్యాగాలను గుర్తుంచుకుంటూ గర్వపడాలని వారికి సన్మానాలు చేయాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం రైతులపై అక్రమ కేసులు బనాయిస్తుందన్న నాదెండ్ల మనోహర్.. ఎస్సీ రైతులపై ఎస్సీ కేసులో పెట్టారని ఆరోపించారు. రాజధాని రైతుల మహాపాదయాత్రకు జనసేన పూర్తిగా మద్దతు ఇస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. జగ్గయ్యపేటలో జనసేన పార్టీ దిమ్మిపోల్చడంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు సక్రమంగా వ్యవహరించకపోతే స్వయంగా జగ్గయ్యపేట వచ్చి ఆందోళన చేస్తామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తామన్న నాదెండ్ల మనోహర్.. గ్రామ, మండల కమిటీలను త్వరలో నియమిస్తామని తెలిపారు . ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గురువారం పార్టీ నాయకుడు, దివంగత తోట మురళీకృష్ణ కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. నందిగామ వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.