
దీనికి తోడు శబ్ద కాలుష్యం కూడా బయట బాగా పెరిగిపోవడంతో చెవులకు సంబంధించిన సమస్యలు కూడా పెరిగి ఈ.ఎన్.టి డాక్టర్స్ కి కూడా డిమాండ్ పెరిగిపోయింది. బయట ఉండే కాలుష్యం ఇలాంటి సమస్యల వల్ల చర్మ సమస్యలు కూడా పెరిగిపోయి, స్కిన్ స్పెషలిస్టులకు ప్రాముఖ్యత పెరిగింది. యాంగ్సైటీ, డిప్రెషన్, లాక్ డౌన్ ఎఫెక్ట్, మొదలైన వాటి వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మానసిక సమస్యలు కూడా బాగా పెరిగి సైకియాట్రిస్టులకూ డిమాండ్ పెరిగింది.
న్యూరో సైకో ఎక్కువ సఫర్ అవుతున్నారు. సెలెక్టివ్ సెరిటోనియన్, రెపటేట్ ఇన్ హిబిటర్స్ అనేది ఒకటి వస్తుందంట. శరీరంలో ఉండే ద్రవానికి సంబంధించిన సెరటోనియన్ లో తేడా రావడం వలన సైకలాజికల్ సమస్యలు రావడానికి కారణం అవుతుంది. యాంగ్సైటీని తగ్గించుకోవడానికి వాడే మందుల వల్ల ఈ సెరటోనియన్ అనేది వస్తుందని తెలుస్తుంది. దీనివల్ల మానసిక సమస్యలు నుండి ఉపశమనానికి బదులుగా బలహీనపడుతున్నారని తెలుస్తుంది. 40 నుండి 60 శాతం మంది ఈ విధంగానే బాధపడుతున్నారని తెలుస్తుంది.
18 నుండి 40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వారు వాటిని అందుకోలేని సందర్భాల్లో ఎక్కువ డిప్రెషన్స్ కి గురి అయ్యి తద్వారా మానసిక రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిత్యం రకరకాల యాంగ్సైటీలతో సతమతమవుతున్నారని తెలుస్తుంది.