భారత దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావం వల్ల చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముంబై ,దక్షిణ కర్ణాటక , కోస్తా కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ,తమిళనాడు లోని మిగిలిన ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది.


 దీనిలో భాగంగా నిన్న రాత్రి నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం వరకు కొనసాగుతూ వస్తున్నాయి, చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలబడుతు , చాలా చోట్ల వరదలు వచ్చే ప్రమాదం కనిపిస్తున్నాయి. చెన్నైలో అత్యధికంగా నుంగంబాక్కం  42 ఎం ఎం  , ఎన్నోరి  24  ఎం ఎం, మాధవరం  23 ఎం ఎం, కాంచీపురం  84 ఎం ఎం  అన్న  యూనివర్సిటీ  69 ఎం ఎం. చెంబరాబాక్కం  60 ఎం ఎం , సత్యభామ  63 ఎం ఎం , మీనా 50  ఎం ఎం+ వర్షం కురుస్తుంది.

ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మూడు సంవత్సరాల కిందట చెన్నై లో వచ్చిన భారీ వరదల గురించి మీ అందరికీ తెలిసినదే. దాని నుంచి తమిళనాడు సర్కారు ఎంత నేర్చుకుందో తెలియాలి. ఆ వరదలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దానికి కారణం సరిగాలేని మన డ్రైనేజీ వ్యవస్థ అని మనకి తెలుసు అయినా కూడా గవర్నమెంట్ దానిపై  దృష్టి సాధించిందా లేదా అనే విషయం ఇప్పుడు మనకి తెలుస్తుంది.


 అలాగే దక్షిణ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కృష్ణానది పొంగి పొర్లుతుంది దాదాపు వారం రోజుల నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ కి వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం లో అత్యధికంగా చాలా రోజులు  శ్రీశైలం నాగార్జున సాగర్ లో గేట్లు  తెచ్చి పీతి నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: