పచ్చమీడియాలో యూనివర్సిటీల పాలకమండళ్ళ ఏర్పాటుపై ఒకే తరహా కథనాలు వచ్చాయి. ఇంతకీ వాటి బాధేమిటంటే పాలకమండళ్ళు రాజకీయ మండళ్ళయిపోయాయట. తాజాగా ప్రభుత్వం వివిధ యూనివర్సిటీలలోని ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ళకు సభ్యులను నియమించింది. నియామకాలు మొత్తం రాజకీయంగానే జరిగిందని బోల్డు బాధపడిపోయింది పచ్చమీడియా. దాంతో యూనివర్సిటీలు మొత్తం కంపు అయిపోయాయని బోల్డు బాధపడిపోయాయి.

 

నిజమే యూనివర్సిటీలు రాజకీయాలకు ఎప్పుడో కేంద్రంగా మారిపోయింది. వైస్ ఛాన్సలర్ల నియామకాలనే ఇపుడు కులమతాల ఆధారంగాను, పార్టీల ఆధారంగాను చేస్తున్నపుడు ఇక ఎగ్జిక్యూటివ్ సభ్యుల నియామకలు ఎంత ? పైగా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏల సిఫారసు ప్రకారమే నియామకాలు జరిగాయని పచ్చమీడియా గొంతెత్తి ఆరవటమే విచిత్రంగా ఉంది. యూనివర్సిటిల్లో ఎప్పుడు ఇటువంటి నియామకాలు జరిగినా రాజకీయ నేతల సిఫారసు ప్రకారమే జరుగుతుందనటంలో సందేహం అవసరమే లేదు.

 

సరే ఇపుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఇటువంటి రాజకీయ నియామకాలు జరుగుతున్నాయనే అనుకుందాం కాసేపు. మరి చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన నియామకాలన్నీ ఏ విధంగా జరిగాయి ? అప్పుడు కుల, మతాలతో పాటు రాజకీయ సిఫారసుల ప్రకారం నియమాకాలు జరగలేదా ? విసి, రిజస్ట్రార్ నియామకాలతో పాటు మొత్తం ఎగ్జిక్యూటివ్ సభ్యుల నియామకాలన్నీ అప్పట్లో కూడా మంత్రులు, కులపెద్దలు, ఎంఎల్ఏలు, ఎంపిల రికమెండేషన్ ప్రకారమే జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

 

మెరిట్ చూసి నియామకాలు చేయటం అనే విషయాన్ని ప్రభుత్వాలు ఎప్పుడో గాలికొదిలేశాయి. ఏ ప్రభుత్వమైనా ఏ యూనివర్సిటిలో నియామకాలైనా పూర్తిగా రాజకీయ కారణాలతోనే , రాజకీయ నేతల మద్దతుతోనే జరుగుతున్నది బహిరంగ రహస్యం. ఈ పద్దతి ఇపుడు కాదు దాదాపు నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పచ్చమీడియా గోల చూస్తే మాత్రం మొట్టమొదటసారిగా జగన్ హయాంలోనే యూనివర్సిటీల్లోకి రాజకీయాలు చొరబడినట్లుగా కలరింగ్ ఇస్తున్నారు.

 

ఏదో ఓ విషయంలో జగన్ పై బురద చల్లటమే చంద్రబాబు, టిడిపి, ఎల్లోమీడియా టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరూ చూస్తున్నదే. యూనివర్సిటి నియామకాల్లో రాజకీయ సిఫారసులు  ఉండకూడదన్న విషయాన్ని అందరు ఒప్పుకోవాల్సిందే. కానీ ఆశయాలకు, ఆచరణకు మధ్య ఆవకాయకు ఆవగింజకు ఉన్నంత తేడా ఉందన్న విషయాన్ని గమనించాలి. ఆశయాలు చెప్పుకోవటానికి మాత్రమే బాగుంటాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా యూనివర్సిటిల్లో బలంగా చొచ్చుకోపోయిన రాజకీయాలను ఒక్కసారిగా ఏరిపారేయటం ఎవరికీ సాధ్యంకాదన్న విషయాన్ని పచ్చమీడియా మరచిపోయినట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: